కొత్త ట్రెండ్ మొదలెట్టిన సాయి తేజ్

0

మెగా హీరో సాయి తేజ్ మరో నెల రోజుల్లో ‘ప్రతి రోజు పండుగే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిరోజు పండుగే చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే తేజూ మరో సినిమాకు సిద్దం అయ్యాడు. కొన్ని వారాల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్పుడే ప్రారంభం అయ్యింది.

తేజూ హీరోగా నభ నటేష్ హీరోయిన్ గా బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో సుబ్బు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది. మామూలుగా అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం లేదంటే ఏదైనా ఫొటోను షేర్ చేయడం జరుగుతుంది. కాని ఈ సినిమాకు మాత్రం చాలా విభిన్నంగా షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటూ చెప్పారు.

తేజూ కార్ వాన్ దిగి నడుచుకుంటూ వెళ్తుండగా కెమెరా ఆయన వెనకాల ఫాలో అయ్యింది. షూటింగ్ జరుగుతున్న స్పాట్ కు వెళ్లి అక్కడ దర్శకుడు మరియు నిర్మాతకు షేక్ హ్యాండ్ ఇచ్చి షూటింగ్ లో తేజూ జాయిన్ అయ్యాడు. ఇందులో తేజూ ఫేక్ కనిపించకుండా బ్యాక్ నుండి వీడియో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడటంతో పాటు ఆసక్తి కలిగేలా చేశారు. మొత్తానికి సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ ప్రారంభం రోజే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.