సూపర్ బ్రేక్ ఫాస్ట్.. బికినీ సాక్షి!

0

న్యూఢిల్లీ భామ అయిన సాక్షి మాలిక్ ఒక మోడల్. ఈ బ్యూటీ ‘సోనూ కే టిటు కి స్వీటీ’ సినిమాలో ‘బం డిగి డిగి బం బం’ అనే సూపర్ హిట్ పాటలో కార్తిక్ ఆర్యన్.. నుష్రత్ భరూచాలతో కనిపించి యూత్ ను ఫిదా చేసేసింది. ఈ జెనరేషన్ బ్యూటీ కాబట్టి సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటూ తరచుగా ఘాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

సాక్షి ప్రస్తుతం ఇండోనేషియాలో ట్రిప్ లో ఉంది. జస్ట్ ఇంటి పక్కనుండే పార్కుకు పోతేనే ఆ ఫోటోలు మనం ఎఫ్ బీలో పోస్ట్ చేసి వాకింగ్.. జంపింగ్.. లాఫింగ్ అంటూ పిచ్చ క్యాప్షన్లు ఇచ్చి మనమేదో పొడిచేసినట్టు జనాలను వేధిస్తాం కదా. అలాంటిది ఒక మోడల్ అయి ఉండి.. ఇండోనేషియా లోని అందమైన ప్రదేశాల్లో సరదాగా గడుపుతూ బికినీలు వేసుకున్న పాప ఫోటోలు పోస్ట్ చెయ్యక పోతే ఎలా? అందుకే రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “నీటిపై తేలుతున్న అల్పాహారం. నేపథ్యంలో అందమైన సముద్రం.. పచ్చటి ప్రకృతి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక ఫోటోలో పింక్ బికిని ధరించి నవ్వుతూ పోజిచ్చింది. మరో ఫోటోలో అదే పింక్ బికినీలో ఒక పొడవాటి అద్దం ముందు నిలుచుని ఒక సెక్సీ సెల్ఫీ తీసుకుంది. పాప పోజు.. ఆ పింక్ బికిని డిజైన్ ఒకసారి చూస్తే ఎవ్వరి మనసైనా చిత్తై పోవాల్సిందే.

ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. “బికినీ బ్రేక్ ఫాస్ట్ అదిరింది”.. “వెరీ హాట్ బ్యూటీ”.. “ఇండోనేషియాలో హాట్ సునామి” అంటూ కొందరు స్పందించారు. ఈ భామకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేవు. ఈ బికినీ ఫెస్టివల్స్ తో ఎవరో ఒకరు సినిమా ఆఫర్ ఇస్తారు లెండి.
Please Read Disclaimer