చైనా ఉత్పత్తులు బహిష్కరించాలి: హీరోయిన్

0

20 మంది భారత జవాన్లను చంపిన చైనాపై భారత్ లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. చైనా దమనకాండకు వ్యతిరేకంగా ఆ దేశ వస్తువులు యాప్స్ వాడవద్దంటూ పెద్ద ఎత్తున దేశంలో ప్రచారం మొదలైంది. పలువురు స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు. ప్రతీ భారతీయుడు చైనాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు.తాజాగా హీరోయిన్ సాక్షి అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్ జవాన్లను చంపిన చైనాను తీవ్రంగా వ్యతిరేకించింది. తాను ఇకపై చైనా ఉత్పత్తులను వినియోగించరాదని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేసింది.శాంతికి సహనానికి మన దేశం చిహ్నమని సాక్షి అగర్వాల్ తెలిపింది. చైనా దేశం మన దేశ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందన్నారు.

అందుకే మన సైనికులపై దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. చైనా చర్యలకు నిరసనగా ఇకపై తాను ఆ దేశ ఉత్పత్తులను ఉపయోగించరాదని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. ఇకపై తాను చైనాకు చెందిన ఉత్పత్తుల ప్రకటనల్లో కూడా నటించనని నటి సాక్షి అగర్వాల్ తెలిపింది.
Please Read Disclaimer