బాలి లో సాక్షి బికిని అవతారం!

0

తెలుగు ప్రేక్షకులకు సాక్షి మాలిక్ పెద్దగా పరిచయం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ న్యూఢిల్లీ భామకు హిందీ ప్రేక్షకుల్లో మాత్రం గుర్తింపు ఉంది. స్వతహాగా మోడల్ అయిన ఈ భామ ‘సోనూ కే టిటు కి స్వీటీ’ సినిమాలో ‘బం డిగి డిగి బం బం’ అనే సూపర్ హిట్ పాటలో కార్తిక్ ఆర్యన్.. నుష్రత్ భరూచాలతో కనిపించి కుర్రకారు మనసులను గంపగుత్తగా దోచేసింది. ఈ భామ మోడల్ కావడంతో సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకుంటుంది.

ఈ భామ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉందట. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ తనదైన శైలిలో దుస్తులు ధరించి ఇండోనేషియా ఉష్ణోగ్రతలకు ఎసరు పెట్టింది. మరి ఈ సరదా పనులను కెమెరాతో బంధించి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు స్వీట్ స్మైల్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. పసుపు రంగు బికినీ.. నడుముకు ఉల్లిపొరలో పావు వంతు మందంతో అందాన్ని వెయ్యి రెట్లు ఇనుమడింపజేసేలా ఉన్న ఒక కురచైన వస్త్రాన్ని ధరించింది. ఇదొక్కటి చాలు నెటిజన్లను కాల్చుకు తినేందుకు. చేతిలో ఎర్రటి రంగులో ఓ జ్యూస్ గ్లాస్ ఉంది. పాప స్లిమ్ గా కర్వ్స్ తో ఉన్న లేటెస్ట్ మోడల్ టీవీ లా ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్లు విలవిలలాడిపోతూ ఆ వేదనలోనే తమకు తోచిన కామెంట్లు పెట్టారు. “నాకు ఆ జ్యూస్ తాగాలని ఉంది”.. “బికినీ కోసమే పుట్టిన బ్యూటీ”.. “హాట్ నెస్ కు నేను సాక్షి” అంటూ కొందరు స్పందించారు. ఈ భామ చేతిలో ఏవైనా ప్రాజెక్టులు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇలాంటి బికినీ పండగలు చేస్తూ ఉంటే ఎవరో ఒక మనసున్న మారాజు ఈ ఫోటోలు చూసి సాక్షికి ఒక ఆఫర్ ఇవ్వకపోతాడా?
Please Read Disclaimer