సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఒళ్లంతా పాల మీగడ.. ప్చ్! ఒక్క ఛాన్స్ ప్లీజ్!!

0

ఒళ్లంతా పాల నురుగు సొగసు.. ప్చ్ అయినా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదేం! అందానికి అందం ట్యాలెంటు అంతకుమించి కవ్వింత తెలిసిన అందాల సాక్షి చౌదరి కెరీర్ ఎందుకనో పూర్తిగా జీరో అయిపోయింది. ఇంతకుముందు సువర్ణ సుందరి అనే చిత్రంలో గాడెస్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏమైందో ఐపు లేకుండా పోయింది.

ఇండస్ట్రీలో అందం ప్రతిభ ఉన్నంత మాత్రాన సరిపోదు…ఆ రెండిటికీ తోడు అదృష్టం కూడా కలిసి రావాలని అంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రవేశించిన ఏ కథానాయిక అయినా కచ్ఛితంగా మెగా హీరోల సరసన ఒక్క సినిమా చేసినా మరో అవకాశం ఉండకపోదని చెబుతారు. కానీ సాక్షి చౌదరికి అలాంటి అరుదైన అవకాశం రాలేదనే చెప్పాలి.

2011లో గ్లాడ్రాగ్స్ మెగామోడల్ కాంటెస్టులో విజేత అయ్యాక సినీ ట్రయల్స్ వేసింది ఈ బ్యూటీ. 2013లో మంచు మనోజ్ సరసన `పోటుగాడు` అనే సినిమాతో తెరకు పరిచయం అయిన ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ అటు పై అల్లరి నరేష్ సరసన జేమ్స్ బాండ చిత్రంలో నటించింది. నరేష్ తోనే సెల్ఫీ రాజాలో నటించింది. గోపిచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలోనూ ఆడిపాడింది. అటుపై తమిళంలో అయిరతిల్ ఇరువర్ అనే చిత్రంలో నటించింది. ఊ. పె. కు. హ- మాగ్నేట్ – రుస్తుం (కన్నడ) ఇవన్నీ ఈ అమ్మడు నటించిన చిత్రాలు.

అయితే ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ మాత్రం అందని ద్రాక్షనే అయ్యిది. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా వేడెక్కించే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సాక్షి చౌదరి రెడ్ హాట్ బాత్ టబ్ ఫోటో వేడెక్కిస్తోంది. బాత్ టబ్ లో పాల నురుగులో స్నానమాచరిస్తున్న దేవతా సుందరిని తలపిస్తోంది. పాల నురుగు దేహశిరులు ఉన్న ఈ అమ్మడు ఏకంగా పాలలోనే స్నానం చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నం చూశాక అయినా ఒక్క ఛాన్స్ ఇస్తారో లేదో మరి.
Please Read Disclaimer