బికినీ బాంబు వేసిన ఇల్లీ

0

గోవా బ్యూటీ ఇలియానా గురించి అసలు ఇంట్రో ఇవ్వాల్సిన పనిలేదు. ఇల్లీ చేసిన సినిమాలు.. ఆండ్రూ నీబోన్ తో ప్రేమ బ్రేకప్పాయణాలు అన్నీ సరసులైన పాఠకులకు తెలుసు. ప్రేమ గొప్ప అనుకుంటాం.. ఈ ప్రపంచం కూడా అదేపనిగా ప్రేమ గురించి గొప్పగా సోది చెప్తూ మనల్ని మైకంలో ఉంచుతుంది. కానీ బ్రేకప్ అయిన తర్వాత మాత్రం ఒక దశలో ‘దరిద్రం వదిలింది’ అనుకోవడం మాత్రం తథ్యం. ప్రస్తుతం ఇల్లీ అదే దశలో ఉన్నట్టుంది.

బ్రేకప్ తర్వాత ఒక కొన్ని రోజులు ఇల్లీ బేబీ డిప్రెషన్ లో ఉందని బాలీవుడ్ మీడియా బ్రాయిలర్ కోడై కూసింది. సమయంలో ఫిట్ నెస్ పై అశ్రద్ధ వహించడం తో కాస్త బరువు కూడా పెరిగింది. ఈ లోకంలో ఎక్కువమంది కాకులే కదా. అందుకే ఇల్లీ బేబీని కాకుల్లా పొడిచారు. దీంతో జ్ఞానోదయం అయిందేమో కానీ జిమ్ము బాట పట్టి మళ్లీ జిల్ జిల్ అనిపించే షేప్ లోకి వచ్చింది. ఈమధ్య నాజూకుగా ఉండే ఫోటోలు వదులుతూ వారిని రివర్స్ లో సతాయించడం మొదలుపెట్టింది. తాజాగా ఇల్లీబేబీ ఒక స్విమ్మింగ్ పూల్ ఒడ్డున నలుపు రంగు బికినీలో సేదదీరుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలలో ఇల్లీ ఎక్స్ ప్రెషన్లు చూస్తే ఎలాంటివారైనా చిత్తైపోతారు.

కసరత్తులు మరీ కఠినంగా చేస్తోందేమో కానీ ఇప్పుడు ఇల్లీ ఒంపుసొంపులతో మిస మిసలాడుతూ ఉంది. ఇక ఆ ఫోటోగ్రాఫర్ కూడా సూర్యకాంతి ఎక్కడ పడాలో ఎక్కడ మిలమిలా మెరవాలో అన్నీ గమనించి మరీ ఫోటోలు తీసినట్టున్నాడు. ఈ ఫోటోలు అందుకే సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కుకీ గులాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ది బిగ్ బుల్’ అనే హిందీ సినిమా లో నటిస్తోంది. ఇది కాకుండా మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేసిందట.
Please Read Disclaimer