పూరీకో ఆర్జీవీకో చిక్కితే ఈవిడ ఖతం!

0

చూడగానే చిత్తయిపోవాలి. మత్తెక్కి గింగిరాలు తిరగాలి. అలాంటి ప్రొఫైల్స్ ఏవి చిక్కినా కొందరు దర్శకులు వదిలిపెట్టరు. ముఖ్యంగా ఆర్జీవీ కానీ ఆయన కాంపౌండ్ డైరెక్టర్లు కానీ వెంటనే వెతికి పట్టుకుని మరీ బరిలో దించేస్తారు. ఇదిగో ఇక్కడ అదిరి పోయే కవ్వింత తుళ్లితత తో ఇరగ దీస్తున్న ఈ టాప్ మోడల్ కం నటి వ్యవహారం చూస్తున్నారు కదా! ఈవిడ ఆర్జీవీ కో లేక ఆయన శిష్యుడు పూరీ కో చిక్కితే ఇక అంతే గాకనీసం హీరోయిన్ గా అవకాశం ఇవ్వలేకపోయినా ఐటెమ్ భామగా అయినా లాక్ చేసేయడం ఖాయమే. దిశా పటానీ.. నభా నటేష్.. నథాలియా కౌర్ .. వీళ్లెవరికీ తీసిపోని నవయవ్వని ఈవిడ. ఇంతకీ పేరు ఏమిటి? అంటే.. సాక్షి మాలిక్. ఈమె రెజ్లర్ సాక్షి కాదు.. మోడల్ సాక్షి. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడికి సోషల్ మీడియాల్లో వీరంగం చూస్తుంటే హై లెవల్లోనే ఉంది. అయితే అందుకు తగ్గట్టు గా తనని పిలిచి అవకాశాలిచ్చేవాళ్లే కరువయ్యారు.

ఇంతకుముందు ఈ అమ్మడు పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసి పాపులరైంది. మారుతి ఆటో ఎక్స్ పో-2020 వేదికపై బ్రాండ్ అంబాసిడర్ గా ర్యాంప్ పై మెరుపులు మెరిపించింది. ఆటో ఎక్స్ పో 2020 వేదిక షేక్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినీ రంగంపైనా ఆసక్తిని కనబరిచింది. కథానాయికగా వెలిగిపోవాలని కలలు గంటోంది. మరి పిలిచి ఛాన్స్ ఇచ్చేదెవరో? ప్రస్తుతం ఇన్ స్టా వేదికగా సాక్షి చెలరేగుతోంది.
Please Read Disclaimer