సల్మాన్ సిగ్నేచర్ స్టెప్.. చరణ్ వెంకీతో కలిసి

0

తమ సినిమాల ప్రమోషన్ల కోసం బాలీవుడ్ తారలు సౌత్ సిటీస్‌కు రావడం మామూలే. ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడమో.. లేదంటే మాల్స్‌కు వెళ్లి జనాలతో కలిసి సందడి చేయడమో జరుగుతుంటుంది. అలా కాకుండా ఓ హిందీ సినిమాకు ఇక్కడి పెద్ద చిత్రాల తరహాలో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడం మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. ఐతే దబంగ్-3 సినిమాతో సల్మాన్ ఖాన్ బృందం కొత్త సంప్రదాయానికి తెర తీసింది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం రాత్రి దబంగ్-3కి పెద్ద స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్‌తో పాటు సుదీప్ సోనాక్షి ప్రభుదేవా రావడం విశేషం. ఇక టాలీవుడ్ నుంచి ముఖ్య అతిథులుగా సల్మాన్ స్నేహితులైన రామ్ చరణ్ వెంకటేష్ హాజరయ్యారు.

ఇంతమంది తారలు ఒక చోట చేరితే ఇక సందడికి కొదవేముంది? ముంబయిలో సైతం ఇలాంటి ఈవెంట్ చేయడం అలవాటు లేని సల్మాన్.. ఈ వేడుకలో పాల్గొనడమే కాదు స్టేజ్ మీద స్టెప్పులు కూడా వేయడం విశేషం. అతడికి రామ్ చరణ్ వెంకీ సైతం తోడయ్యారు. చేతులు తిప్పుతూ వేసే తన సిగ్నేచర్ స్టెప్‌తో సల్మాన్ తన అభిమానుల్ని అలరించారు. చరణ్ వెంకీ సైతం అతణ్ని అనుకరించారు. దీంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. అనంతరం సల్మాన్.. అభిమానులకు ముద్దిస్తూ తెలుగు సంప్రదాయ పద్ధతిలో నమస్కరిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో దబంగ్-3 విడుదలవుతోంది. తెలుగులో అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తుండటం విశేషం.
Please Read Disclaimer