ఇదేం జోడీ అంటున్న నెటిజనులు!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘భరత్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ‘ఇన్షాఅల్లా’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సల్మాన్ – భన్సాలి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ 20 ఏళ్ళ క్రితం సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత వారి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత మరోసారి వారిద్దరూ జట్టు కడుతుండడంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని సల్మాన్ ఈమధ్యే స్వయంగా ధృవీకరించాడు. సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం రావడంతో అలియా భట్ కూడా చాలా సంతోషంగా ఉంది. సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ గా ఎగ్జైట్ అయ్యారు. కాకపోతే కొంతమంది నెటిజనులకు ఈ జోడీ అస్సలు నచ్చలేదు. సల్మాన్ వయసెక్కడ.. అలియా ఏజ్ ఏంటి? ఈ ఇద్దరి జోడీని అసలు భన్సాలి లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఎలా సెట్ చేస్తున్నాడని విమర్శలు.. ట్రోలింగ్ మేసేజులతో సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. వారి వాదనలో నిజం లేకపోలేదు. ఎందుకంటే సల్మాన్ వయసు 53 ఏళ్ళు.. అలియాకు 25. ఈమధ్యే 26 వ ఏట అడుగుపెట్టింది. సరిగ్గా సగం వయసుండే హీరోయిన్ తో రొమాన్స్ ఏంటననేది వారి లాజిక్. పైగా సల్మాన్ కు మోహంలో వయసు కనపడుతోంది. అలియాను చూస్తే టీనేజ్ అమ్మాయిలాగా కనిపిస్తుంది.. ఇద్దరి జోడి సరిగా ఉండదని పెదవి విరుస్తున్నారు.

మన పిచ్చిగానీ భన్సాలి.. సల్మాన్ లు ఇవన్నీ వింటారా? వారికి తోచినట్టు చేసుకుంటూ పోతారు. అయినా ఈ నెటిజనులు మరీ ఇదైపోతున్నారు కానీ మన టాలీవుడ్ లో తాతలైన హీరోలు మనవరాళ్ళ వయసున్న హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతున్నారు. రొమాన్సు చేస్తున్నారు. ఇలా తాతలు చేస్తే తప్పు లేదు కానీ పాపం ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ అయిన సల్మాన్ ఖాన్ అదే పని చేసే విమర్శిస్తున్నారు..క్యా హై ఏ నాయిన్సాఫీ.. కోయితో బతాదే సహీ..!
Please Read Disclaimer