టాప్ స్టోరి: ఖాన్ ల మత్తు దిగిపోయినట్టేనా?

0

బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ అనగానే.. షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్ త్రయం గుర్తుకు వస్తారు. ఇక బాలీవుడ్ గ్రేట్ ఎనిమీస్ గా సల్మాన్ – షారూక్ పేరు మార్మోగింది. ఆ ఇద్దరూ కెరీర్ ఆరంభం కలిసి నటించారు. ఎన్నో సినిమాలు చేశారు. కాలక్రమంలో ఘర్షణ పడ్డారు. దూరమయ్యారు. ఆ తర్వాత తిరిగి కలిసి పోయారు. ఈ జర్నీ ఎంతో వైవిధ్యమైనది. 30 సంవత్సరాల వ్యవధిలో వారి రిలేషన్ షిప్ లో ఎన్నో డిఫరెన్సెస్ వచ్చాయి. స్నేహం నుంచి శత్రుత్వం వరకు రకరకాల పరిణామాలు అభిమానులకు తెలుసు. ఇక కింగ్ ఖాన్ వర్సెస్ భాయి జాన్ వార్ లో అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటనలో కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకల్లో బిగ్ ఫైట్ ఇప్పటికీ హాట్ టాపిక్. షారూక్ – సల్మాన్ ల మధ్య నాటి గొడవను అభిమానులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు.

2008 జూలై 2016 కత్రినా స్టార్-స్టడెడ్ బర్త్ డే బాష్ లో సల్మాన్ … కింగ్ ఖాన్ మధ్య ప్రవర్తనలు పరిశీలిస్తే…. 2008 లో కత్రిన ఓ పెద్ద బర్త్ డే వేడుకను నిర్వహించింది. ఆ పార్టీకి బాలీవుడ్ లో టాప్ స్టార్లు ఎటెండయ్యారు. షారుఖ్ – గౌరీ ఖాన్.. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ .. తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీలో సల్మాన్ – షారూఖ్ మధ్య ఈగోలు మనస్ఫర్థలు గొడవలకు దారి తీసాయి. ఆ ఇద్దరూ ఆ రాత్రి గొడవలో దాదాపు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నంత పనైంది.

తిరిగి 2008 లో సల్మాన్- షారూక్ మధ్య బుల్లితెర హోస్టింగ్ పరంగా పోటీ నెలకొంది. సల్మాన్ దస్ కా దమ్… షారుఖ్ `క్యా ఆప్ పంచీ పాస్ సే తేజ్ హైన్? షోలు టీఆర్పీల్లో పోటీపడ్డాయి. TRP లో షారూక్ షో కంటే సల్మాన్ షో డామినేట్ చేసింది. SRK షోకు అంతగా ప్రజాదరణ లభించలేదు. ఆ తర్వాత సల్మాన్ సినిమాలో కామియో ఆఫర్లను షారూక్ తిరస్కరించడం చర్చకు వచ్చింది. అనంతరం షారూక్ నటించిన ఓం శాంతి ఓంలో సల్మాన్ – కత్రిన జంట కనిపించారు. అటుపై కేబీసీ షోలోనూ సల్మాన్ షారూక్ ఆతిథ్యాన్ని మన్నించి కనిపించాడు. అయితే అటుపై సల్మాన్ ఇచ్చిన ఓ ఆఫర్ ని బాద్ షా షారూక్ తిరస్కరించడంతో సల్మాన్ దానికి మనస్తాపం చెందాడని ప్రచారమైంది. అటుపై కత్రిన 2008 బర్త్ డే పార్టీలో ఆ ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. ఆ గొడవ అనంతరం SRK – గౌరీ ఆ పార్టీని వీడారు.

ఆ తరువాత.. కత్రినా పార్టీలో సల్మాన్ – ఐశ్వర్య రాయ్ గురించి షారూఖ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని .. దాంతో కోపంగా ఉన్న సల్మాన్ కత్రినా పార్టీని విడిచిపెట్టి వెళ్లాడని అప్పటి వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్ లో హల్ చల్ చేశాయి. తరువాత SRK ఈ విషయంపై మౌనం వహించాడు. అక్టోబర్ 2008 లో ఓ ఇంటర్వ్యూలో తాము మిత్రులం కాదు అలాగని శత్రువులం కాదు అని ఆ ఇద్దరూ వెల్లడించారు. సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో తాను షారుఖ్ కి ఎప్పుడూ సినిమా ఆఫర్ ఇవ్వలేదని.. “షారుఖ్ నా సోదరుడిలాంటోడే“ అని చెప్పాడు. షారూక్ కష్టకాలంలో నన్ను సర్.. సర్ అని పిలిచేవాడు. SRK పని కావాలని అడుగుతూ ఇంటింటికి వెళ్ళడం నేను చూశాను. అతను ఇప్పుడు( స్టార్ డమ్ వచ్చాక) వేరే వ్యక్తి అయ్యాడు అని సల్మాన్ వ్యాఖ్యానించాడు.

కొన్ని వరుస ఫైటింగుల తర్వాత బాలీవుడ్ శిబిరాలుగా విభజించబడింది. సల్మాన్ ఖాన్ క్యాంప్ .. షారూఖ్ ఖాన్ క్యాంప్ గా విడిపోయింది. సల్మాన్ కు సహోద్యోగులు .. నటీనటుల నుండి చాలా మద్దతు లభించగా.. SRK కి అతని దర్శకుడు మద్దతుగా నిలిచారు. అటుపై ఆ ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు.

2010 లో సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవుడు మాత్రమే తనను SRK ని కలపగలడని.. స్నేహితులను చేయగలడని వ్యాఖ్యానించారు. “దేవుడు మాత్రమే వచ్చి మమ్మల్ని మళ్ళీ స్నేహితులను చేయగలడు. కానీ అది జరగడం లేదు“ అంటూ భాయిజాన్ నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. ఆ తరువాత కాఫీ విత్ కరణ్ లో షారుఖ్ సల్మాన్ తనపై కోపంగా ఉంటే.. అది 100 శాతం తన తప్పు అని అనడం చర్చకొచ్చింది. కానీ సల్మాన్ ఈ క్షమాపణను అంగీకరించలేదు. ఇది టీఆర్పీ కోసం చెప్పినదేనని లైట్ తీస్కున్నాడు.

ఆ తర్వాత కాలక్రమేణా మార్పు కనిపించింది. 2015 లో సల్మాన్ – షారుఖ్ పాచ్ అప్ అయ్యి తిరిగి కలిసి కనిపించారు. అటుపై ఖాన్ లు కొత్త జీవితాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఇద్దరూ తరచూ ఈవెంట్స్ లో కలిసి కనిపిస్తున్నారు. అభిమానులు వారి స్నేహాన్ని చూసేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. 2018 లో సల్మాన్ – షారూక్ నటించిన `జీరో` చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో కనిపించాడు. తరువాత 2019 లో బచ్చన్ ఇంట్లో దీపావళి పార్టీలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ మేనేజర్ బట్టలు మంటలకు ఆహుతి అయినప్పుడు ఆ మంటలను ఆర్పడం ద్వారా షారుఖ్ పెద్ద సాయం చేశాడు. దానిపై సల్మాన్ ఖాన్ SRK ను ఉద్ధేశిస్తూ ఒక ప్రత్యేక పోస్టును షేర్ చేశాడు. అభిమానులు ఆ ఇద్దరి స్నేహాన్ని కోరుకుంటున్నారు. కలిసి ఉంటే ఆనందిస్తున్నారు. ఇటీవల షారూక్ కెరీర్ డౌన్ ఫాల్ అయినా సల్మాన్ మాత్రం రేసులో ఇంకా దూసుకెళుతున్నాడు. కింగ్ ఖాన్ తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు కాస్త వేచి చూస్తున్నాడు. ఇప్పటికైతే ఖాన్ ల మత్తు దిగిపోయినట్టే. కలిసి ఉంటేనే కలదు సుఖం.. అంటున్నారు. కాలంతో పాటే వచ్చిన మార్పు ఇది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-