దగ్గుబాటి వారి పెళ్లిలో సల్మాన్ భాయ్

0

విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ యజమాని సురేందర్ రెడ్డి మనవడితో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఆశ్రిత- వినాయక్ రెడ్డి జోడీ పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహం చేసుకుంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ పెళ్లి జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో భారీగా ప్లాన్ చేసింది దగ్గుబాటి కుటుంబం. గత మూడు రోజులుగా ఈ వివాహానికి సంబంధించిన సమాచారం దగ్గుబాటి అభిమానులకు చేరుతూనే ఉంది. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకకు ఇటు టాలీవుడ్ నుంచి టాప్ సెలబ్రిటీలతో పాటు – అటు కోలీవుడ్ – బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల నుంచి ప్రముఖులు ఎటెండ్ అవుతున్నారు. ఇదివరకూ సంగీత్ కార్యక్రమంలో రానా – సమంత – నాగచైతన్య సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ వివాహ మహోత్సవానికి విక్టరీ వెంకటేష్ స్నేహితుడు .. బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఎటెండ్ అయ్యారు. వేడుక ఆద్యంతం భాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. వెంకీకి సల్మాన్ ఎంతో సన్నిహితుడు. ఆ ఇద్దరి మధ్యా రెండున్నర దశాబ్ధాలుగా స్నేహం ఉంది. మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు – అగ్రనిర్మాత డి.సురేష్ బాబు సల్మాన్ తో ఎంతో అనుబంధాన్ని మెయింటెయిన్ చేశారు. ఆ క్రమంలోనే ఆశ్రిత పెళ్లి వేడుకలకు సల్మాన్ భాయ్ ఎటెండ్ అయ్యారు.

వెంకీ కుమార్తె ఆశ్రిత ప్రస్తుతం ప్రొఫెషనల్ బేకర్ గా కొనసాగుతున్నారు. తాత – తండ్రి బాటలో మనవడు వినాయక్ రెడ్డి వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. ఈ జోడీకి సినీపరిశ్రమ ప్రముఖులు సహా రాజకీయ రంగ ప్రముఖులు – పారిశ్రామిక వేత్తలు బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వినాయక్ రెడ్డి తాతగారు ఎంతో సన్నిహితుడు అని చెబుతారు.
Please Read Disclaimer