భాయిజాన్.. సంజుబాబా.. ఓ ఫ్లాష్ బ్యాక్ పిక్

0

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నిన్న సోమవారం తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ నుంచి అధీరా లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ తన కెరీర్ లో టాప్ ఫామ్ లో లేకపోవచ్చు కానీ ఆయన ఫాలోయింగ్ కు వచ్చిన లోటేమీ లేదు. సెలబ్రిటీలలో కూడా సంజయ్ దత్ కు క్లోజ్ ఫ్రెండ్స్.. అభిమానులు ఎక్కువే. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.

సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా సల్మాన్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫ్లాష్ బ్యాక్ ఫోటో షేర్ చేసి “హ్యాపీ బర్త్ డే బాబా” అంటూ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. సల్మాన్ షేర్ చేసిన ఫోటో ఒక్కసారిగా అభిమానులను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిపోయింది. దాదాపు పాతికేళ్ళ క్రితం తీసిన ఫోటో కావడంతో సల్మాన్.. సంజయ్ ఇద్దరూ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. సంజయ్ తన ట్రేడ్ మార్క్ లాంగ్ హెయిర్ తో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. భాయిజాన్ సంజూ బాబా చేతులను పట్టుకొని పెద్దగా నవ్వడం చూస్తుంటే ఏదో పెద్ద జోక్ వేసుకున్నట్టే ఉంది. సల్మాన్.. సంజయ్ ఇద్దరూ కలిసి ‘సాజన్’.. ‘చల్ మేరె భాయ్’.. ‘దస్’ చిత్రాల్లో నటించారు.

సల్మాన్ మాత్రమే కాదు పలువూరు బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ దత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫర్హాన్ అఖ్తర్.. అనిల్ కపూర్ కూడా ప్రత్యేకంగా తమ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ ప్రస్తుతం ‘ప్రస్థానం’.. ‘పానిపట్’.. ‘సడక్ 2′.. భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’.. ‘కెజీఎఫ్ 2’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
Please Read Disclaimer