2వేల కోట్ల ఆస్తిపరుడు.. చీపురు పట్టి ఊడ్చాడు!

0

దాదాపు 2000 కోట్ల ఆస్తిపరుడు ఆ స్టార్ హీరో. ఫోర్బ్స్ జాబితాలో ఐదేళ్లుగా అతడి పేరు మార్మోగుతూనే ఉంది. అందులో సగం చారిటీకే ఖర్చు చేసేందుకైనా వెనకాడని తత్వం. మిలియనీర్ అయినా సామాన్యుడిలా ఒదిగి ఉండేందుకు సాటి మనిషిని ప్రేమించేందుకే ఇష్టపడతాడు. ఎందరికో ఎన్నో గుప్తదానాలు చేశాడు. కష్టంలో ఉన్నవారిని ఆదుకున్నాడు. పరిశ్రమ వ్యక్తుల్నే కాక బయటివారికి ఎంతో సాయం చేశాడు. ఎందరో కథానాయికలకు లైఫ్ నిచ్చాడు. డెబ్యూ హీరోల్ని పరిచయం చేసి తన వారసులుగానూ ప్రకటించాడు. ఇటీవల కరోనా కష్టకాలంలో అతడు ఉదారంగా ఎంతో సేవ చేశాడు.

కండల హీరోని అన్న గర్వం కించిత్ కూడా కనిపించదు. ఇక నిత్య బ్రహ్మచారిగా పెళ్లి అంటేనే అంత దూరలో ఉండే ఆ స్టార్ హీరో ఇటీవలి కాలంలో ముగ్గురు గాళ్ ఫ్రెండ్స్ తో తన ఫామ్ హౌస్ లో చేయిస్తున్న సేవలకు బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది. గత రెండు మూడు నెలలుగా ఆయన ముంబై ఔట్ స్కర్ట్స్ లోని వందలాది ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయన తో పాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్.. లులయా వాంటూర్.. కత్రిన లాంటి హాట్ గాళ్స్ ఈ ఫామ్ హౌస్ లోనే స్పెండ్ చేస్తున్నారు. ఆయనెవరో విడిగా చెప్పాలా ది గ్రేట్ సల్మాన్ ఖాన్.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన లాక్డౌన్ సమయాన్ని ముంబై శివార్లలోని పన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో గడుపుతున్నాడు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సల్మాన్ ఫామ్ హౌస్ లో క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాడు. బీయింగ్ సల్మాన్ ఇన్ స్టా గ్రామ్ లో అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. సల్మాన్ షార్ట్- టీషర్ట్ వేసుకుని పెరిగిన గడ్డంతో ఎంతో సింపుల్ గా ఉన్నాడు. చీపురు పట్టి రోడ్ లో పడి ఉన్న చెత్తను ఊడ్చాడు. తనతో పాటే ఇతర స్టార్లు.. ఫామ్ హౌస్ పనోళ్లు ఊడ్చారు.

 

View this post on Instagram

 

#SwachhBharat #WorldEnvironmentDay Music Credits: Mark Mothersbaugh

A post shared by Salman Khan (@beingsalmankhan) on


పర్యావరణం ప్రాముఖ్యతను తెలియజేయడానికే ఇదంతా. ఇన్ స్టా పోస్ట్ లో # స్వచ్ భారత్ # వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనే హ్యాష్ట్యాగ్లను జోడించిన సల్మాన్ తాను ఎంతటి ప్రకృతి ప్రేమికుడో చెప్పకనే చెప్పాడు. అన్నట్టు సల్మాన్ నటిస్తున్న రాధే శ్యామ్ షూటింగ్ పెండింగులో ఉంది. అంతా సవ్యంగా పూర్తయి.. ఎప్పటికి రిలీజ్ కానుందో?
Please Read Disclaimer