వెటరన్ కు కర్చీఫ్ వేసిన సూపర్ స్టార్!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘భరత్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఈ ఏడాది జూన్ 5 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ సినిమాకు అధికారిక రీమేక్. ఆలా అని మక్కికి మక్కి కాపీ కాదు. అడాప్టేషన్ అనుకోవచ్చు. ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేశారట. ఇదిలా ఉంటే సల్మాన్ మరో కొరియన్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నానని రీసెంట్ గా కన్ఫాం చేశాడు.

సల్మాన్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో నిర్మించిన ‘నోట్ బుక్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ద్వారా జహీర్ ఇక్బాల్.. ప్రనూతన్ బహల్ ను హీరో హీరోయిన్లు గా బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కొరియన్ సినిమా ‘వెటరన్’ రీమేక్ చేస్తున్నానని ధృవీకరించాడు. సల్మాన్ బావ అయిన అతుల్ అగ్నిహోత్రి ‘వెటరన్’ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని.. సంజయ్ లీలా భన్సాలి సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను మొదలు పెడతామని తెలిపాడు.

‘వెటరన్’ ఒక యాక్షన్ కామెడీ ఫిలిం. భారీ క్రైమ్ సిండికేట్ ను నడిపే ఒక టాప్ బిజినెస్ మాన్ గుట్టురట్టు చేయడమే ఈ సినిమా కాన్సెప్ట్. ఇదిలా ఉంటే.. ‘భరత్’ తర్వాత సల్మాన్ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అందులో ‘దబాంగ్ 3’ ఒకటి కాగా సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇన్షాఅల్లా’ మరొకటి. ఈ చిత్రాల తర్వాతే ‘వెటరన్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్తుంది. సల్మాన్ గతంలో తెలుగు రీమేక్ లపై ఎక్కువగా ఆధారపడేవాడు. ఇప్పుడు రూటు మార్చి జై కొరియన్ అంటున్నాడు..!
Please Read Disclaimer