భాయ్ ని అలా రౌండప్ చేశారు!

0

ఈవెంట్లలో పబ్లిక్ వేదికలపై సల్మాన్ భాయ్ చేసే హడావుడి గురించి చెప్పాల్సిన పనిలేదు. అభిమానుల్ని చూస్తే చాలు.. భాయ్ లో ఉత్సాహం ఉరకలెత్తేస్తుంది. చొక్కా విప్పి 6 ప్యాక్ చూపించేస్తూ రచ్చ రచ్చ చేసేస్తాడు. అభిమానుల్లోనూ అదే జోష్ ని నింపుతాడు. ఇది ఒక్క సల్మాన్ కి మాత్రమే చెల్లింది. ఇక పార్టీ లు..పబ్బుల్లో భాయ్ వీరంగం ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా! అందమైన గాళ్స్ గ్యాంగ్ చుట్టు ఉంటే ఆ ఉత్సాహం మరింతగా పీక్స్ కి చేరుకుంటుంది. అందుకు ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

2020లో అడుగు పెడుతున్న వేళ.. న్యూఇయర్ వేడుకల్లో అరుదైన సన్నివేశమే చోటు చేసుకుంది. 31 మిడినైట్ భాయ్ తన ఫామ్ హౌస్ లో గాళ్స్ తో చిందులేసిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ హీరోయిన్లు డైసీ షా- లూలియా వాంటూర్ సాయే మంజ్రేకర్ సంగీత బిజిలానీ ఇలా భామలంతా భాయ్ చుట్టూ రౌండప్ చేసి మాంచి హుషారైన డాన్సులు చేసారు. వాళ్లతో కలసి బ్యాచిలర్ బాయ్ చెలరేగిపోయాడు. ఫుల్ నైట్ అంతా డాన్సింగ్ మూడ్ లోనే ఉన్నారు ఈ బ్యాచ్. పార్టీ సందర్భంగా వివిధ రాకాల డిషెస్.. డ్రింక్స్ ని సల్మాన్ భాయ్ తో భామలంతా షేర్ చేసుకున్నారు. ఇంకా పలువురి భామా మణులు సెల్ఫీలతో అభిమానులను పలకరించారు.

ఇటీవలే సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన దబంగ్-3 రిలీజైన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగులో ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. కానీ ఇక్కడ అంతగా వసూళ్లు రాబట్టలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలోనే రాధే అనే సినిమాలో నటిస్తున్నాడు. సెట్స్ లో ఉందీ చిత్రం.
Please Read Disclaimer