ఆ నటుడికి భాయ్ బీఎండబ్ల్యూ కారు బహుమతి

0

వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో కనిపించే సల్మాన్ లో చాలానే యాంగిల్స్ కనిపిస్తాయి. గాళ్ ఫ్రెండ్స్ తోనే అతగాడికి కలిసి రాలేదు. ఎప్పుడూ ఏదో ఒక చిక్కు అతన్ని వెంటాడుతుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా కండలవీరుడి గురించి మంచిగా చెప్పుకునే అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా.. అవసరం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు రావటమే కాదు.. సాయానికి వెనుకాడరన్న పేరుంది.

అంతేకాదు.. తనతో నటించిన వారికి ఖరీదైన గిఫ్టులతో సర్ ప్రైజ్ ఇచ్చే గుణం సల్మాన్ కు ఉంది.తాజాగా అలాంటి పనే చేశారీ బాలీవుడ్ అగ్ర నటుడు. తాను నటించిన దబంగ్ 3 సక్సెస్ అయి.. రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ వంతంగా దూసుకు పోతున్న వేళ.. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను అద్భుతంగా పోషించిన కన్నడ స్టార్ నటుడు సుదీప్ కు ఖరీదైన బహుమతి ని ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

తాజాగా సుదీప్ ఇంటికి వెళ్లిన సల్మాన్.. ఖరీదైన బీఎండబ్ల్యూ ఎమ్ 5ను బహుమతిగా ఇచ్చారు. తనకిచ్చిన గిఫ్టు మీద ఈగ ఫేం సుదీప్ స్పందించాడు. మీరు మంచి చేస్తే మీకు మంచే జరుగుతుందనే మాట నిజమని అర్థమయ్యేలా చేశారు సల్మాన్. తను నాపైనా.. నా కుటుంబం మీదా చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలని పేర్కొన్నారు. మీతో కలిసి పని చేయటం.. మీరు మా కోసం రావటం ఎంతో సంతోషం అంటూ సోషల్ మీడియా లో పేర్కొన్నారు సుదీప్. అంత ఖరీదైన కారును బహుమతి ని ఇచ్చిన తర్వాత ఈ మాత్రం రియాక్ట్ కాకుండా ఉంటారా?
Please Read Disclaimer