సల్మాన్ `ఇండియానా జోన్స్` రీమేక్ ప్లాన్!

0

రీమేక్ ల ట్రెండ్ వేడెక్కిస్తున్న రోజులివి. ప్రతి భాషలోనూ రీమేక్ లు కామన్ గా మారాయి. ఓ చోట విజయం సాధించిన సినిమాని మరో చోట రీమేక్ చేసి హిట్ కొట్టేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని స్టార్ గా నిలబెట్టిన సినిమాల్లో రీమేక్ లే ఎక్కువ. ‘వాంటెడ్’ మహేష్- పూరీ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ ‘పోకిరి’కి రీమేక్.

సల్మాన్ ఇతర చిత్రాలు చూస్తే.. ‘తేరే నామ్’ తమిళంలో విక్రమ్ నటించిన ‘సేతు’కి రీమేక్. అలాగే ‘బివి నెం.1’ తమిళంలో కమల్ హాసన్ నటించిన ‘సతీ లీలావతి’కి రీమేక్. ‘జుడ్వా’ నాగార్జున నటించిన ‘హలో బ్రదర్కి… ‘బాడీగార్డ్’ మలయాళంలో అదే పేరుతో వచ్చిన సినిమాకి రీమేక్ లు. భాయ్ నటించిన బ’రెడీ’ తెలుగులో రామ్ హీరోగా నటించిన `రెడీ`కి….. ‘నో ఎంట్రీ’ అనేది ప్రభుదేవా నటించిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’కి రీమేక్. `హర్ దిల్ జో ప్యార్ కరేగా` అనేది హాలీవుడ్ చిత్రం `వైల్ యు వర్ స్లీపింగ్`… ‘క్యోన్ కీ’ అనేది మలయాళ చిత్రం `తలవట్టమ్`కి.. ‘హమ్ తుమ్హారే హై సనమ్’ అనేది తమిళ చిత్రం ‘తొట్ట చినంగమ్`కి రీమేక్ లు కాగా….. ‘కిక్’ తెలుగులో రవితేజ నటించిన `కిక్`కి రీమేక్. ‘ట్యూబ్లైట్’ అనేది అమెరికన్ సినిమా ‘లిటిల్ బాయ్’ కి రీమేక్. ఇవన్నీ దాదాపు బాక్సాఫీసు వద్ద విజయాలను అందుకున్నాయి. సల్మాన్ ని బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ని చేసినవన్నీ రీమేక్ లే.

ఇప్పుడు సల్మాన్ మరో రీమేక్ లో నటించబోతున్నారు. హాలీవుడ్ లో పాపులర్ అయిన ‘ఇండియానా జోన్స్’ సిరీస్ ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. నిధి అన్వేషణ ప్రధానంగా సాగే ఈ యాక్షన్ చిత్రాలు వరల్డ్ బాక్సాఫీసుని షేక్ చేశాయి. హర్రిసన్ ఫోర్డ్ అద్భుత నటనతో మైమరిపించారు. తనకి కలిసొచ్చిన రీమేక్ ల ట్రెండ్ ని మున్ముందు కూడా సల్మాన్ కొనసాగించబోతున్నారు. అందులో భాగంగా ఆయన ఈ `ఇండియానా జోన్స్` ట్రయాలజీ సిరీస్ హక్కులను దక్కించుకున్నారట. హిందీలో ఈ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిర్మించడమే కాదు ఇండియానా జోన్స్ గా ఆయనే నటించబోతున్నట్టు సమాచారం. మరి దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు..? నటీనటుల వివరాలేమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇటీవల ‘దబాంగ్ 3`తో నిరాశపడిన సల్లూభాయ్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా దిశా పటానీ నటిస్తుంది. 2020 ఈద్ కి విడుదల కానుంది. దీంతోపాటు ‘కభీ ఈద్ కభీ దివాళి’ చిత్రంలో తన భావమరిది ఆయుష్ శర్మతో కలిసి నటిస్తున్నారు. ఇందులో ఆయుష్ విలన్గా కనిపించనున్నారు. సల్మాన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-