చిరు కోసం అతడిని పంపించిన సల్మాన్

0

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ తాజాగా పూర్తి అయ్యిందనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ సంవత్సరంకు పైగా చిత్రీకరణ జరుపుకున్న సైరా చిత్రంను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారు. ఇక సైరా చిత్రం తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. చిరు 152వ చిత్రం కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్న కొరటాల మూవీలో చిరంజీవి న్యూ లుక్ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

కొరటాల రెడీ చేసిన కథానుసారం చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించాల్సి ఉంటుందట. అందుకే సైరా షూటింగ్ పూర్తి అయ్యేంత వరకు వెయిట్ చేసి చిరంజీవిని తనకు కావాల్సిన విధంగా మార్చుకున్న తర్వాత కొరటాల మూవీని ప్రారంభించాలని భావించాడు. అందుకే ఆలస్యం అయినా ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. మరో రెండు మూడు నెలల వరకు కూడా చిరంజీవి వర్కౌట్స్ చేసేందుకే టైం కేటాయించబోతున్నాడట. ఇక చిరంజీవి వర్కౌట్స్ చేయబోతున్నది ముంబయికి చెందిన ప్రముఖ ట్రైనర్ ఆధ్వర్యంలో అంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సల్మాన్ ఖాన్ కు వ్యక్తిగత ట్రైనర్ గా చేసిన వ్యక్తి ఇప్పుడు చిరంజీవి కోసం హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ తన తండ్రి ఫిట్ నెస్ కోసం ట్రైనర్ గురించిన సలహా కోరగా సల్మాన్ ఖాన్ స్వయంగా తన ట్రైనర్ ను రెండు నెలల పాటు హైదరాబాద్ పంపినట్లుగా చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ కు చిరంజీవి మరియు రామ్ చరణ్ లు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఆ మద్య ఉపాసన నిర్వహిస్తున్న హెల్త్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి కోసం ట్రైనర్ ను ముంబయి నుండి పంపించాడు.
Please Read Disclaimer