తనను సల్మాన్ పెళ్లాడుతున్నట్లు చెప్పిన నటి

0

బాలీవుడ్ కండల వీరుడు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టైటిల్ తీసేసి ఏళ్లు అయినప్పటికీ పెళ్లి మాత్రం కాని సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతోంది. విన్నంతనే.. నిజమా? అంటూ చదివి ఊసూరు పుట్టిస్తున్న ఈ వ్యవహారంలోకి వెళితే.. బాలీవుడ్ కు చెందిన హాట్ నటి జరీన్ ఖాన్ షాకిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. తనను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పారు.

తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమెను పలు ప్రశ్నలు వేశారు. ఈ సమయంలో ఆమెకో చిత్రమైన ప్రశ్నను సంధించారు. మీపైమీరే ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలి.. విన్నంతనే నిజమనిపించేలా ఉండాల్న మాటకు స్పందించిన జరీన్ ఖాన్.. తనను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోనున్నట్లుగా చెప్పారు.

ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సల్మాన్ పెళ్లి చేసుకోనున్నారన్నది చాలా ఫన్నీరూమర్ గా ఆమె అభివర్ణించారు. సల్మాన్ జంటగా వీర్ చిత్రంలో నటించిన జరీన్ తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత పలు సినిమాలుచేసిన ఆమె హట్ బ్యూటీగా పాపులర్ అయ్యారు. తాను చేయాల్సిన కామెడీ చేసేసిన జరీన్.. తనకు పెళ్లి మీద నమ్మకం లేదన్నారు.

తాను పెళ్లిని నమ్మనని చెప్పిన ఆమె.. అసలీ మధ్యన పెళ్లి కామెడీగా మారిందన్నారు. మొత్తానికి సల్మాన్ తనను పెళ్లి చేసుకోనున్నారన్న మాటతో అందరిని తనవైపు చూసేలా చేసుకున్నారు జరీన్ ఖాన్. తెలివంటే ఇలానే ఉండాలి మరి.
Please Read Disclaimer