బిగ్ బాస్ కు స్వస్థి.. లేడీ బాస్ ఎంట్రీ

0

ఎన్నో దేశాల్లో సక్సెస్ అయిన బిగ్ బాస్ ను దాదాపు 13 ఏళ్ల క్రితం హిందీలో ప్రారంభించారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 4 నుండి ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 13 వరకు కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. సీజన్ సీజన్ కు సల్మాన్ పారితోషికం భారీగా పెంచుకుంటూ పోయినా కూడా షో నిర్వాహకులు ఆయన్నే హోస్ట్ గా కావాలనుకున్నారు. ఎపిసోడ్ కు కోటి రూపాయల పారితోషికం అంటూ వార్తలు వచ్చాయి.. అంతకు మించి కూడా తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.

బిగ్ బాస్ తో సల్మాన్ ఖాన్ కు సినిమాల స్థాయిలో ఆదాయం వచ్చింది. ఇంత ఆధాయంతో పాటు మంచి పేరు వస్తున్నా కూడా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట. వైధ్యులు సల్మాన్ ఖాన్ ను ఎక్కువ సమయం మాట్లాడవద్దన్నాడట. అలాగే కోపం తెచ్చుకోవడం మరియు ఇతరులపై కూడా అరవడం మంచిది కాదని చెప్పాడట.

షో లో కొన్ని సార్లు కంటెస్టెంట్స్ పై సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. వారు చేసే తప్పులకు మందలించాల్సి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ నుండి తప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులు చాలా రోజులుగా సల్మాన్ కు సూచిస్తున్నారట. కాని సల్మాన్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఎట్టకేలకు సీజన్ 13 పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడట.

సల్మాన్ ఖాన్ తప్పుకోనుండగా ఆయన స్థానంకు బాలీవుడ్ దర్శకురాలు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ పర్హా ఖాన్ ను బిగ్ బాస్ కొత్త హోస్ట్ గా ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రసారం కాబోతున్న సీజన్ 14కి ఫర్హా ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా మొదటి లేడీ హోస్ట్ గా వ్యవహరించబోతుంది. మరి సల్మాన్ ఖాన్ స్థాయిలో ఆమె షో ను సక్సెస్ చేయగలదా అనేది చూడాలి.