ఐదుగురు గోపికలు వెంటాడినా ఇంకా వర్జినే

0

బ్యాచిలర్ భాయ్ సల్మాన్ ఖాన్ స్నేహాల గురించి గాళ్ ఫ్రెండ్స్ గురించి పరిచయం అవరం లేదు. ఆన్ స్క్రీన్ …ఆఫ్ ద స్రీన్ భాయ్ రొమాన్స్ గురించి తెలియనిది ఎవరికి. భాయ్ ఎఫైర్ల గురించి బాలీవుడ్ మీడియా నిరంతరం కోడై కూస్తుంటుంది. పబ్లిక్ వేదికలపైనా గాళ్ ఫ్రెండ్స్ జాబితా తెలుసులే అంటూ.. కోస్టార్స్ సరదాగా ఆటపట్టించిన సందర్భాలెన్నో. కానీ ఇలాంటి విషయాల్లో నిజాన్ని నిర్భయంగా అంగీకరించేది ఎందరు? మరి ఆ లిస్ట్ లో భాయ్ ఉన్నాడా.. లేడా? అంటే సల్మాన్ భాయ్ తెలివిగా ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసాడు.

తానాజీ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్.. ఆయన భార్య కాజోల్ ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ షోలో సందడి చేసారు. అజయ్-సల్మాన్ ఇద్దరితో నిజాల్ని చెప్పించేందుకు కాజోల్ హోస్ట్ గా మారింది. రకరకాల ప్రశ్నలతో భాయ్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. సల్మాన్ మీకు ఐదుగురు కంటే తక్కువ గర్ల్ ప్రెండ్స్ ఉన్నారా..? అని ప్రశ్నిస్తే .. వెంటనే అజయ్ మైక్ అందుకుని ఒకే సమయంలోనా? లేక తన జీవితం మొత్తంలోనా? అని భాయ్ ని ఇరికించాడు.

దీంతో భాయ్ తప్పించుకోలేని పరిస్థితి. నా జీవితం మొత్తంలో ఐదుగురు గాళ్ ప్రెండ్స్ మాత్రమే ఉన్నారు అని తెలిపాడు. కానీ తాను స్టిల్ వర్జిన్!! అంటూ ఫన్నీగా కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది నిజమే కదా . నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు… కాబట్టి వర్జిన్ అన్నాడు భాయ్. వెంటనే కాజల్ ఇది పచ్చి అబద్దం. నేను అస్సలు నమ్మను. ఈ మెషిన్ కూడా సల్మాన్ సమాధానం స్వీకరించలేదంటూ ఆటపట్టించింది. మరి పెళ్లి ఎప్పుడు భాయ్ అని ప్రశ్నిస్తే.. దానికి ఇంకా సమయం ఉందని రొటీన్ అన్సర్ ఇచ్చాడు. మరి భాయ్ గాళ్ ఫ్రెండ్స్ విషయంలో నిజాన్ని ఒప్పుకున్నట్లా? లేదా? అభిమానులే తేల్చాలి.
Please Read Disclaimer