ఇండస్ట్రీలో ఐదుగురే స్టార్లన్న హీరో!

0

కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి కొత్త నిర్వచనాలు చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తనతో పాటు అమీర్ ఖాన్ – షారుఖ్ ఖాన్ – అక్షయ్ కుమార్ – అజయ్ దేవగన్ లు మాత్రమే స్టార్లమని ఇంకొన్నేళ్ళు ఇలాగె కొనసాగుతామని చెబుతూ గతంతో పోలిస్తే తమ సినిమాల వసూళ్లు ఎనిమిది నుంచి పది శాతం తగ్గి ఉండవచ్చేమో కాని దాని వల్ల వచ్చిన నష్టమేమీ లేదంటున్నాడు.

సల్మాన్ చెప్పినదాంట్లో లాజిక్ ఉంది కాని పూర్తిగా ఏకీభవించలేం. షారుఖ్ ఖాన్ ఇప్పటికే ఆరు నెలలకు పైగా ఖాళీగా ఉన్నాడు. జీరో డిజాస్టర్ తో పాటు గత నాలుగు సినిమాలు దారుణ ఫలితాలు అందుకోవడం పట్ల నిరాశతో ఇంకే ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. గత ఏడాది తగ్స్ అఫ్ హిందూస్తాన్ ఫ్లాప్ దెబ్బకు అమీర్ ఖాన్ ఏకంగా సారీ చెప్పాల్సి వచ్చింది. ఇక అజయ్ దేవగన్ ఏదోలా బండి నెట్టుకొస్తున్నాడు కాని మొదటి రోజు ఇతని సినిమా టికెట్ల కోసం ఎగబడే సీన్ ఇప్పుడు లేదు

ఇక సల్మాన్ ఖాన్ సంగతి చూస్తే భారత్ హిట్ అని చెప్పుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇది జస్ట్ యావరేజ్ అని ట్రేడ్ తేల్చేసింది. గత ఏడాది వచ్చిన రేస్ 3 అంతకుముందు వచ్చిన ట్యూబ్ లైట్ లాంటివి ఇప్పటికీ బయ్యర్లకు పీడకలలుగానే మిగిలాయి. మరి సల్మాన్ చెబుతున్న స్టార్ డం వీటిని ఏ మాత్రం కాపాడలేకపోయాయి.

ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే విభిన్న ప్రయోగాలు చేస్తూ మంచి విజయాలు నమోదు చేస్తున్నాడు. మూసలో ఉంటే తనూ వీళ్ళ బ్యాచ్ లోనే ఉండేవాడు. అసలు స్టారే కాని షాహిద్ కపూర్ కబీర్ సింగ్ మూడు వందల కోట్లు రాబట్టడం హిందిలో ఎవరికి పరిచయమే లేని ప్రభాస్ బాహుబలి ఏకంగా ఇండస్ట్రీ టాప్ 1గా నిలవడం లాంటివి సల్మాన్ ప్రస్తావించి ఉంటె బాగుండేదని విశ్లేషకుల మాట
Please Read Disclaimer