వైరల్: పోతురాజు అవతారమెత్తిన భాయిజాన్

0

ఇండియాలో ఎంతోమంది హీరోలు ఉంటారు.. ఎంతోమంది స్టార్లు.. సూపర్ స్టార్లు కూడా ఉంటారు. కానీ భజరంగీ భాయిజాన్ సల్మాన్ ఖాన్ తీరే వేరు. ఆయన ఫాలోయింగ్ వేరు.. ఆయన యాంటి ఫాలోయింగ్ వేరు. ఇక ఆయన గర్ల్ ఫ్రెండ్స్ సంగతి రాస్తూ పోతే చేతులు నొప్పెట్టాల్సిందే కానీ లిస్టు మాత్రం కంప్లీట్ కాదు. ఆయిన పెళ్ళి గురించి రాసి రాసి.. చదివి చదివి జనాలు అలిసిపోయారు. అయినా ఆయన పెళ్ళి చేసుకోడు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా సల్మాన్ ఒక కొరడాతో తనను తాను ఎడాపెడా బాదుకున్నాడు!

బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సల్మాన్ కు అంత కష్టం ఎందుకు వచ్చిందా అని మీకు అనుమానం రావచ్చు. రీసెంట్ గా సల్మాన్ తన షూటింగ్ లొకేషన్ దగ్గర పోతురాజుల గ్రూప్ ను కలవడం జరిగింది. పోతురాజులు ఒక కొరడాతో తమను తాము కొట్టుకుంటారు కదా. ఆ కొరడాను కొన్ని ఏరియాల్లో చర్నకోల.. అని కమ్చి అని .. జాటి అని చబుకు అని సెలగొల అని పిలుస్తారు. ఈ పేర్లు మాకు తెలియదు మొర్రో మాకు ఆమాత్రం తెలుగు రాదు మేము ఇంగ్లిపీసు చదివిన మేథావులం అంటారా అయితే దాన్ని ఇంగ్లీష్ లో ‘విప్'(whip) అంటారు. పోతురాజులతో కాసేప్టు సంభాషించిన సల్మాన్ వారిని అడిగి ఎలా దాంతో కొట్టుకుంటారో వివరంగా తెలుసుకున్నాడు. నేను ట్రై చేస్తా అన్నాడు. ఏకంగా భాయిజాన్ వచ్చి ప్రేమగా అడిగితే భారతదేశంలో ఉండే ఏ పోతురాజైనా అయన వెపన్ ను ఇవ్వకుండా ఎలా ఉంటాడు.. ఆయన ఇచ్చాడు.. ఈయన తనఒంటిపై ఎర్రగా కమిలేలా గట్టిగా.. ఘట్టిఘట్టిగా నాలుగు తగిలించుకున్నాడు. ఇంత స్టొరీ లో గొప్పవిషయం కొట్టుకోవడం కాదు.. అలా వీరబాదుడు బాదుకుంటున్న సమయంలో సల్మాన్ పెదవిపై చిరునవ్వు చెరగకపోవడం.

పైగా.. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేసి. “వారి నెప్పిని పంచుకోవడంలో ఒక ఆనందం ఉంది.. ఆహ్. పిల్లబిత్తిరి బ్యాచ్.. ఇలాంటివి మీపై ప్రయోగించుకోకండి.. ఎవరిపై ప్రయోగించకండి” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు.. ఆ క్యాప్షన్ కు నెటిజన్లు షాక్ తిన్నారు. కొందరేమో భాయిజాన్ కు సాటిలేదు అని ఆకాశానికెత్తారు. అర్థం అయిందిగా ఈ ఆర్టికల్ ఫస్ట్ లైన్ మరోసారి చదవండి.. చదివారా.. ఇప్పుడర్థం అయిందిగా.. హీరోలందు భాయిజాన్ వేరయ్యా.. విశ్వదాభిరామ ఆయన సల్మాన్ ఖాన్ రా మామా!

 

View this post on Instagram

 

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don’t try this on your self or on any 1 else

A post shared by Salman Khan (@beingsalmankhan) on
Please Read Disclaimer