భారీ పారితోషికంతో టెంమ్ట్ చేశారట

0

హిందీ బిగ్ బాస్ ఎదురు లేని రారాజు మాదిరిగా దూసుకు పోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 13వ సీజన్ కొనసాగుతుంది. మరో రెండు మూడు వారాల్లో హిందీ బిగ్ బాస్ సీజన్ 13 పూర్తి అవ్వాల్సి ఉంది. కాని ఈ సీజన్ కు వస్తున్న రెస్పాన్స్ మరియు రేటింగ్ కారణంగా అదనంగా 5 వారాలను పొడిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్నారు. అయితే సల్మాన్ ముందస్తు ప్లాన్ ప్రకారం 13వ సీజన్ పూర్తి అయిన వెంటనే రాధే సినిమాను మొదలు పెట్టాలి.

రాధే సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో అయిదు వారాలు అదనంగా బిగ్ బాస్ కోసం కేటాయించడం తన వల్ల కాదంటూ సల్మాన్ చెప్పాడట. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటి వరకు ఇచ్చిన పారితోషికంకు డబుల్ పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ లో ఎపిసోడ్ కు కోటి చొప్పున సల్మాన్ ఖాన్ తీసుకున్నాడు. కాని ఈ అదనపు అయిదు వారాలకు గాను ఎపిసోడ్ కు రెండు కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్దమయ్యారట.

ఎపిసోడ్ కు రెండు కోట్లు ఆఫర్ చేయడంతో సల్మాన్ ఖాన్ టెంమ్ట్ అయ్యాడని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ అదనపు అయిదు వారాలకు కూడా హోస్టింగ్ చేసేందుకు ఒప్పుకున్నాడట. రాధే సినిమాను షూటింగ్ అడ్జెస్ట్ మెంట్స్ చేసుకుంటూ ఆ అయిదు వారాలు చేయాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడు. భారీ పారితోషికం ఆఫర్ చేస్తే ఎవరైనా బెండ్ అవ్వాల్సిందే అని సల్మాన్ విషయంలో కూడా నిరూపితం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
Please Read Disclaimer