ఎడిటర్ అవతారమెత్తిన సల్మాన్ ఖాన్

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ – ప్రభుదేవా కాంబినేషన్ లో ఇంతక ముందు ‘వాంటెడ్’ ‘దబాంగ్ 3’ చిత్రాలు వచ్చాయి. గతేడాది రిలీజైన ‘భారత్’ ‘దబాంగ్ 3’ చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో రేసులో వెనుక పడిన సల్మాన్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రాధే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్ కానుకగా విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నాడంట. అన్నీ తానై ‘రాధే’ విషయంలో జాగ్రతలు తీసుకుంటున్నాడని సమాచారం.

అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఎడిటర్ గా కూడా మారాడని బీటౌన్ లో చర్చించుకుంటున్నారు. ఒక షార్ట్ టర్మ్ ఎడిటర్ ని పెట్టుకొని ‘రాధే’ని సల్మాన్ స్వయంగా ఎడిటింగ్ చేస్తున్నారని సమాచారం. కరోనా ఎఫెక్ట్ నేపథ్యం లో చిత్ర షూటింగులు నిలిచిపోవడంతో సల్మాన్ తన ఇంట్లో ఈ చిత్రానికి ఎడిటింగ్ పనులు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నాడట. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన తమ్ముడితో కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏదేమైనా ‘రాధే’ మూవీతో హిట్ కొట్టి సల్మాన్ మళ్ళీ పూర్వ వైభవం సాధించాలని సల్లూ భాయ్ అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-