స్నేహా ఉల్లాల్‌ను ఆ హీరో వాడుకుని వదిలేశాడా?

0

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. సంగీతా బిజిలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో సల్మాన్ డేటింగ్‌ చేశారు. కానీ ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేదు. అయితే సంగీతా బిజిలానీతో పెళ్లి పీటలదాకా వచ్చి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఇటీవల సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్, నిర్మాత సాజిద్ నదియాద్‌వాలా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదలా ఉంచితే.. సల్మాన్ గురించి ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి స్నేహా ఉల్లాల్ గుర్తుందా? ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘సింహా’ వంటి సినిమాల్లో నటించింది.

చూడటానికి ఆమె అచ్చం ఐశ్వర్య రాయ్‌ను పోలి ఉంటుందని చాలా మంది అనేవారు. తాను ఇష్టపడిన ఐశ్వర్య రాయ్ ఎటూ తనకు తగ్గలేదని, ఆమెలా ఉన్న స్నేహా ఉల్లాల్‌తో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారట సల్మాన్. 2005లో వచ్చిన ‘లక్కీ: నో టైం ఫర్ లవ్’ అనే సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు స్నేహ. ఈ సినిమాలో ఆమె సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే స్నేహా ఉల్లాల్‌ను పెళ్లి చేసుకోకుండా సల్మాన్ నాలుగేళ్లు డేటింగ్ చేసి వదిలేశారట. ఈ విషయాన్ని స్నేహ ఒకానొక సందర్భంలో వెల్లడించినట్లు పలు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఆ తర్వాత స్నేహ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను వెతుక్కున్నారు. అయితే ఇక్కడ కూడా స్నేహకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. 2015లో వచ్చిన ‘బేజుబాన్ ఇష్క్’ అనే సినిమా తర్వాత స్నేహ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఇందుకు కారణం ఆమె ల్యూపస్ అనే వ్యాధితో బాధపడుతుండటమే. ఈ విషయాన్ని స్నేహ రెండేళ్ల క్రితం వెల్లడించారు.

ఈ వ్యాధి వల్ల అరగంట పాటు కూడా నిలబడలేకపోయేదాన్నని, ఇన్నాళ్లూ అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. త్వరలో ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికొస్తే రెండేళ్ల క్రితం ఉలియా వంతూర్ అనే రొమేనియన్ మోడల్‌ను ఏకంగా తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు సల్మాన్. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. ఎప్పటికైనా కత్రినా తన ప్రేమను అంగీకరించి తనను పెళ్లి చేసుకోకపోదా అని ఎదురుచూసిన సల్మాన్ ఇక వేచి చూడలేక ఉలియాతోనే సెటిల్ అయిపోయేలా ఉన్నారని తాజా సమాచారం. ఏదేమైనా సల్లూ భాయ్ ఎప్పటికైనా ఓ ఇంటివాడు కాకపోడా అని అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వారి ఆశ నెరవేరేలా కనిపించడంలేదు.
Please Read Disclaimer