# కరోనా ఎఫెక్ట్: సల్మాన్- అక్కీ మధ్య ఫైటింగ్

0

టాలీవుడ్ లో దసరా బిగ్ ఫైట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 2020 దసరా రేస్ లో చిరు-రజనీకాంత్ -యశ్ త్రయం పోటీపడనున్నారు. అటు బాలీవుడ్ లోనూ ఈ తరహా పోటీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్ బిగ్ స్టార్స్ సల్మాన్ – అక్షయ్ మధ్య ఠఫ్ వార్ గురించిన చర్చ మొదలైంది. 2020 ఈద్ బరిలో ఆ ఇద్దరూ పోటీపడనున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్… కిలాడీ అక్షయ్ కుమార్ మధ్య పోటీ అంటే ఫ్యాన్స్ లో అది ఆసక్తికర టాపిక్. ఈసారి ఇరువురి నడుమ ఈద్ పండక్కి రసవత్తర పోటీ నెలకొననుంది. ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ గతంలో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన సినిమాలెన్నో ఘనవిజయాలు సాధించాయి. మరోసారి ఆ ఇద్దరి మధ్య వార్ పై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మేలో ఈద్ పండగకు ఇద్దరు బిగ్ స్టార్స్ బరిలో దిగడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. పోటీబరిలో ఎవరిది పై చేయి కాబోతోంది? బాక్సాఫీస్ విజేతగా నిలిచేది ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయితే ఉన్నట్టుండి ఈ వార్ దేనికి? అంటే .. ఇదంతా కరోనా ప్రభావమేనని తెలుస్తోంది. కరోనా దెబ్బకి మొత్తం జీవన వ్యవస్థనే అతలాకుతలం అవుతోంది. వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వినోద పరిశ్రమపైనా దాని ప్రభావం అసాధారణంగా ఉంది. కరోనా దెబ్బకు ఇటు టాలీవుడ్ సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లోనూ సినిమాల విడుదలలు ఆగిపోతున్నాయి. అక్కడా థియేటర్లని బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బాలీవుడ్లో భారీ సినిమాల రిలీజ్ తేదీల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 24న విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ `సూర్యవంశీ` చిత్రాన్ని వాయిదా వేశారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఈద్ పండుగని పురస్కరించుకుని మేలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.

అయితే రంజాన్ కానుకగానే సల్మాన్ తన చిత్రం `రాధే: ది మోస్ట్ వాంటెండ్ భాయ్` ని విడుదల చేయనున్నట్టు సినిమా ప్రారంభ సమయంలోనే ప్రకటించారు. తాజాగా అక్కీ సినిమా వచ్చి పడటంతో బాక్సాఫీసు వద్ద ఈ ఇద్దరికి మధ్య పోటీ తప్పదని అర్థమవుతుంది. కలెక్షన్ల కోసం ఆ ఇద్దరు థియేటర్ల వద్ద ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఇదొక్కటేనా.. ఇంకా ఎన్నో సినిమాల షెడ్యూల్స్ అతలాకుతలం అయిపోతున్నాయి. అయితే రంజాన్ సందర్భంగానే అక్షయ్ తన మరో సినిమా `లక్ష్మీబాంబ్`ని విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడా స్థానంలో ఆయన చిత్రమే రావడంతో `లక్ష్మీబాంబ్`ని వాయిదా వేస్తున్నారట. మొత్తానికి ఈ కరోనా వైరస్ దెబ్బకి చిత్ర పరిశ్రమ కూడా విలవిలలాడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-