5 రోజుల్లో పెళ్లి అనగా వద్దన్నాడట!

0

బాలీవుడ్ సూపర్ స్టార్.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయిదు పదుల వయసు దాటి కూడా మూడు సంవత్సరాలు అయ్యింది. ఇంకా కూడా సల్మాన్ కు పెళ్లిపై ఆలోచన ఉన్నట్లుగా అనిపించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటూ దూసుకు పోతున్న సల్మాన్ ఖాన్ మొదట ఐశ్వర్య రాయ్ తో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇంకా కొందరు ముద్దుగుమ్మలను ఈయన ప్రేమిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి.

ఆ వార్తలన్నీ కూడా పుకార్లుగానే మిగిలి పోయాయి. ఇటీవల ఒక ఫారిన్ బ్యూటీని ఈయన ప్రేమిస్తున్నట్లుగా ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కాని అది కూడా నిజం అయ్యేలా కనిపించడం లేదు. అసలు సల్మాన్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే సల్మాన్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్ను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ నడియాడ్ వాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సాజిద్ నడియాడ్ ఒక టాక్ షో లో సల్మాన్ ఖాన్ పెళ్లికి సంబంధించి స్పందించాడు. 1999లో ఒక అమ్మాయితో సల్మాన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. అదే సమయంలో నాకు కూడా పెళ్లి కుదరడంతో ఇద్దరి పెళ్లిలు ఒకే సమయంలో ఒకే చోట చేయాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. పెళ్లికి అంతా సిద్దం అయ్యింది. 5 రోజుల్లో పెళ్లి జరుగబోతుంది. కార్డులు పంచడంతో పాటు షాపింగ్ కూడా అయ్యింది.

ఆ సమయంలో నాకు పెళ్లి పై ఇష్టం లేదు.. ఆసక్తి లేదు అంటూ సల్మాన్ పెళ్లిని క్యాన్సిల్ చేయించాడట. ఆ సమయంలో సల్మాన్ పెళ్లి చేసుకుంటే ఈ సమయంకు ఆయన పిల్లలు ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ గా పరిచయం అయ్యే వారు. అప్పటి నుండి కూడా సల్మాన్ పెళ్లి విషయమే ఆలోచిస్తున్నట్లుగా లేడని ఆయన చెప్పుకొచ్చాడు
Please Read Disclaimer