లావు అవ్వటం లేదన్న సరదా ప్రశ్నకు ఆ సమాధానమేంటి సామ్?

0

రూల్స్ ను బ్రేక్ చేయటంలో సమంత తర్వాతే ఎవరైనా. పెళ్లి తర్వాత ఇలా ఉండాలి కదా? అన్న మాట ఎవరి నోటి నుంచైనా వస్తే.. ఇలానే ఎందుకు ఉండాలన్నట్లుగా వ్యవహరించే తీరు ఆమె సొంతం. ఒక మహిళ పెళ్లికి ముందు కానీ.. పెళ్లి తర్వాత కానీ తనను తాను ఇండిపెండెంట్ గా ఉండటం ఎలానో చేతల్లో చూపిస్తోందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. గ్లామర్ రసాన్ని పొంగి పొర్లేలా ఆమె పోస్టు చేసే ఫోటోలతో సోషల్ మీడియాలో ఆమె గురించి చర్చ హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె నటించిన జాను ఈ వారం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో బిజీబిజీగా ఉంది సామ్. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమెను.. ఈ చిత్ర హీరో శర్వానంద్ ను కలిసి ఇంటర్వ్యూ చేసిన ఆమె.. సామ్ ను సరదాగా ఒక ప్రశ్నను సంధించింది.

వరుస హిట్లతో ఇన్నేసి కాంప్లిమెంట్లు వచ్చేస్తున్నాయి కదా.. ఇన్ని పొగడ్తలు వచ్చిన తర్వాత కూడా అస్సలు లావు అవ్వట్లేదే అంటూ సరదగా క్వశ్చన్ ను సంధించింది. దీనికి ఊహించని విధంగా.. సీరియస్ సమాధానం ఇస్తూ షాకిచ్చింది సమంత. సక్సెస్ క్రెడిట్ మొత్తం తన సొంతం కాదని.. అందరి భాగస్వామ్యమని ఒద్దికగా చెప్పి.. మనం పని చేస్తేనే సరిపోదు.. అన్ని కలిసి రావాలంటూ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోకుండా జాగ్రత్త పడింది సమంత. అంతా బాగుంది కానీ.. ఏదో యాంకరమ్మ సరదా ప్రశ్న వేస్తే.. దానికి లైట్ గా రిప్లై ఇవ్వాల్సింది పోయి.. మరీ ఇంత సీరియస్ ఏంది సామ్ అన్నడౌట్ రాక మానదు.
Please Read Disclaimer