సామ్.. శృతి.. రమ్యకృష్ణల రవివర్మ అందం ఫోజులు

0

రవివర్మ పెయింటింగ్ లో ఏదో మాయ ఉంటుంది. ఆయన గీసిన అద్బుతమైన కళా ఖండాలు ఖండాంతరాలు దాటి మరీ ప్రాచుర్యం పొందాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతాలను ఆయన కుంచె నుండి ఆవిష్కరించారు. రవివర్మ కుంచె నుండి వచ్చిన అందాలను మ్యాచ్ చేసేందుకు ఎంతో మంది అమ్మాయిలు ప్రయత్నిస్తూ ఉంటారు. కాని ఏ ఒక్కరికి అది సాధ్యం అయ్యేది కాదు. తాజాగా మరోసారి హీరోయిన్స్ సమంత మరియు శృతిహాసన్ సీనియర్ నటి రమ్యకృష్ణలు రవివర్మ పెయింటింగ్స్ ను తలపించేలా కాస్ట్యూమ్స్ ను ధరించి 2020 క్యాలెండర్ కు ఫోజ్ లు ఇచ్చారు.

నామ్ అనే బ్రాండ్ తో రాబోతున్న ఈ క్యాలెండర్ ఫొటో స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట రమ్యకృష్ణ స్టిల్ ను రంగమార్తాండ సినిమాలోని స్టిల్ అనుకున్నారు. కాని అసలు విషయంపై క్యాలెండర్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాకుండా సమంత మరియు శృతి హాసన్ లు కూడా రవివర్మ పెయింటింగ్ ను అనుసరించి వావ్ అనిపించేలా కనిపించారు.

ఈ ముగ్గురు కూడా రవివర్మ పెయింటింగ్ ను రీ క్రియేట్ చేసినట్లుగా ఉన్నారు. ఆ పెయింటింగ్స్ కు జీవ కళ వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రవి వర్మ అందాలతో ఏ ఒక్కరు మ్యాచ్ అవ్వరు అనుకున్నారు. కాని ఈ ఫొటోలను చూస్తుంటే మాత్రం ఆ అభిప్రాయం తప్పేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.