సామజవరగమన 10 కోట్ల వ్యూస్ క్లబ్

0

10 మిలియన్ వ్యూస్ రొటీన్.. 100 మిలియన్ల వ్యూస్ సాధిస్తేనే గొప్ప అన్నట్టుగా ఉంది పోటీ. వంద మిలియన్లు అంటే ఏకంగా 10 కోట్ల వ్యూస్ అని అర్థం. సోషల్ మీడియా .. డిజిటల్ స్పీడ్ కొనసాగుతున్న ఈ రోజుల్లో ఈ స్థాయిని స్టార్ హీరోలు అందుకుంటున్నారు. ప్రమోషన్ ఏకంగా స్కైని టచ్ చేస్తోంది.

తాజాగా.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ నుంచి బయటకు వచ్చిన తొలి గీతం `సామజవరగమన..` ఈ అరుదైన ఫీట్ ని అందుకుంది. ఈ సాంగ్ రిలీజైంది మొదలు యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ సాంగ్ గా పాపులరైంది. అలా రికార్డుల్ని వేటాడుతూ 10 కోట్ల వ్యూస్ క్లబ్ లో చేరింది. యూట్యూబ్ మాధ్యమంలో ఇంతమంది ఈ పాటను ఆస్వాధించారంటే అర్థం చేసుకోవచ్చు.

థమన్ తన కెరీర్ లో మరో రికార్డ్ బ్రేకింగ్ ట్యూన్ అందించాడన్న ప్రశంసలు ఇప్పటికే దక్కాయి. సిధ్ శ్రీరామ్ ఈ పాటను అలపించాడు. ఇక ఇదే ఊపులో `అల వైకుంఠపురములో` తదుపరి ప్రమోషన్ కి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2న ఓ స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Please Read Disclaimer