ప్రోమో: సామజవరగమన.. సంపేసాడంతే

0

సామజవరగమన.. ఆ సౌండింగే సంపేసిందంతే. థమన్ 2.0 రీబూటెడ్. 2019లోనే బెస్ట్ సౌండ్ ని వినిపించాడు ఎస్.ఎస్.థమన్. 2020 అంతా పదే పదే వినిపించే చార్ట్ బస్టర్ గీతమిది. ఇప్పటికే యూత్ ని ఓ రేంజులో ఊపేస్తోంది. రింగ్ టోన్.. కాలర్ టోన్.. రేడియో టోన్ వరకే పరిమితం కాదు. టీవీ ఆన్ చేస్తే చాలు ఎంతో వినసొంపుగా ఫ్యాన్స్ చెవుల్ని తాకుతున్న రేర్ ట్యూన్ కూడా ఇది. సూటయ్యే మ్యూజిక్ ని ఇచ్చాడు.

అంతేనా.. ఈ పాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్పులు మైండ్ బ్లాక్. స్టైల్ అన్న పదానికి చిరునామా ఎందుకయ్యాడో ఇదిగో ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. బన్ని డ్యాన్సుల పరంగా మరోసారి ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక అందమైన లిరిక్.. దానికి అంతకుమించిన ట్యూన్ కుదరితే.. దానికి బన్ని మార్క్ స్టైలిష్ స్టెప్స్ యాడైతే.. విజువల్ పండగ ఎలా ఉంటుందో సామజవరగమన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అల.. ఎక్స్ ప్రెషన్స్ కి తగ్గట్టే ఈ లిరిక్ ని అంతే అందంగా రాసారు.

నీ కాళ్లను పట్టుకు వదలవన్నవి చూడే నాకళ్లు.. ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు? నీ కళ్లకు కావాలి కాస్తా ఏ కాటుకలా నా కలలు.. నువు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు..!! సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాతిక ప్రాయం కుర్రాడిలా చెలరేగి తాదాత్మ్యంతో రాసిన లిరిక్ ఇది. సిధ్ శ్రీరామ్ గానం గుండె లయ తప్పేంత అందంగా కుదిరింది. పదే పదే ప్రోమోని తిరగేసి చూసేంత స్టఫ్ ఉందంటే నమ్మండి. జనవరి 12న పెద్ద తెరపైనే అసలు ట్రీట్ ని ఆస్వాధించవచ్చు.
Please Read Disclaimer