సమంతా హార్ట్ ఎమోజీ తో జేజేలు పలికిందే!

0

గతంలో పోలిస్తే ఈ జెనరేషన్ హీరోయిన్ల కు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువనే చెప్పాలి. ఇది కొందరికి అతి శయోక్తిగా అనిపించవచ్చు కానీ నిజం మాత్రం ఇదే. జిమ్ము డ్రెస్సులకు కూడా డిజైనర్ వేర్ వాడే జమానా ఇది. జాన్వి.. కియారా లాంటి కొత్త తరం భామల కలర్ఫుల్ టీ షర్టులు.. మినీలు మైక్రోలు చూస్తే ఈ విషయం నిజమని ఎవరైనా చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఇక ఫోటో షూట్ల కోసం ధరించే డిజైనర్ డ్రెస్సులను చూస్తే ఎవరికైనా మతి పోవడం ఖాయం.

బాలీవుడ్ భామలు ఈ ట్రెండ్ లో సౌత్ బ్యూటీల కంటే ముందే ఉన్నారు. అయితే సౌత్ లో కూడా సమంతాలాంటి స్టార్ హీరోయిన్లు ఫ్యాషన్ ట్రెండ్స్ ను భలేగా ఫాలో అవుతూ ఫ్యాషనిస్టా.. ఫ్యాషన్ ఐకాన్ లాంటి బిరుదులు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ భామలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫోటోలను షేర్ చేసిన సమయంలో వారికి జేజేలు కూడా తెలుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం సోనమ్ కే. అహూజా రాల్ఫ్ లారెన్ బ్రాండ్ వారి ప్యాంట్ సూట్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్.. సోనం స్టైల్ చూసి భలేగా ఉందని సమంతా ముచ్చట పడిపోయింది.

ఇదిలా ఉంటే తాజా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనుష్క శర్మ ఒక క్రీమ్ కలర్ డ్రెస్ లో కనిపించింది. రౌండ్ నెక్ కాలర్.. పఫ్ఫీ షోల్డర్స్.. థై స్లిట్ డిజైన్ ఉండే డ్రెస్ లో అనుష్క ఒక కుర్చీపై కూర్చుంది. గోల్డ్ కలర్ హై హీల్స్ డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ ను చూస్తే అనుష్క ఒక సూపర్ మోడల్ లాగా కనిపించింది. ఈ ఫోటోలకు సమంతా ఒక రెడ్ హలర్ హార్ట్ ఎమోజి తో తన స్పందన తెలపడం విశేషం. అంటే అనుష్క డ్రెస్.. స్టైల్.. సామ్ హార్ట్ ను టచ్ చేసిందనేగా అర్థం.
Please Read Disclaimer