సమంత అడుగుతోంది రూ.42 ఇవ్వమని..

0

ప్రముఖ సినీ నటి సమంత సినిమాలతోనే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. తీరిక లేని పనులతో ఉన్నప్పటికీ.. చారిటీ విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆమె కావేరీ నది పరిరక్షణ కోసం రంగంలోకి దిగారు. ప్రముఖ అధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి సమంత ప్రచారకర్తగా మారారు.

లక్ష మొక్కల్ని నాటాలన్న జగ్గీ వారి ఆలోచనకు తాను వాణిగా మారిన సమంత.. తాజాగా ప్రచారం మొదలు పెట్టారు. కావేరీ నది పరిరక్షణలో భాగంగా భారీ ఎత్తున మొక్కల్ని నాటేందుకు వీలుగా చేపట్టిన ఈ కార్యక్రమం కోసం ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నారు. కావేరీ పిలుస్తోంది.. మీరు స్పందిస్తారా? అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఓపెన్ చేసి.. ఒక మొక్క కోసం రూ.42 విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు. ప్లకార్డు పట్టుకొని విరాళాలు ఇవ్వాలని కోరుతున్న సమంత.. మీరు రూ.42 విరాళంగా ఇస్తే ఒక మొక్కను నాటిన వారు అవుతారంటున్నారు.

తాజాగా తాను చేసిన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న సమంత.. మొక్కలు నాటే సేవా కార్యక్రమానికి ప్రచారం చేయటం పర్యావరణ ప్రేమికుల్ని ఆకట్టుకుంటుంది. సమంత మాటకు ఇంప్రెస్ అయి ఆమె చెప్పినట్లు రూ.42 విరాళం ఇవ్వాలనుకునే వారు ఆన్ లైన్ లోనే ఆ మొత్తాన్ని చెల్లించేయొచ్చట. ఇందుకోసం .. http://samantha.cauverycalling.org ఏర్పాటు చేశారు కూడా. ఇంకెందుకు ఆలస్యం?
Please Read Disclaimer