తూచ్ .. నేను అలా అనలేదు!- సమంత

0

మరో రెండు మూడేళ్లలో రిటైర్మెంట్ అంటూ అక్కినేని కోడలు సమంత అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. `జాను` ప్రమోషన్స్ లో సామ్ వ్యాఖ్య వైరల్ అయ్యింది. కథానాయిక అంటే కెరీర్ స్పాన్ చాలా తక్కువ.. కానీ తాను చాలా లక్కీగా పదేళ్లకు పైగా కెరీర్ సాగించానని తర్వలో విరమిస్తానని తెలిపింది. దానికి తగ్గట్టు సమంత కొత్త యాక్టివిటీస్ సందేహానికి తావిచ్చాయి. ప్రీ స్కూల్ బిజినెస్ లోకి అడుగు పెట్టడం…ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫాం పైనా సత్తా చాటాలన్న ఆలోచన సహా సమంత ఫ్యామిలీ మ్యాటర్స్ చూశాక.. నటన నుంచి విమరణమ ఖాయమనే అనుకున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ఆ విషయం జోరుగా ప్రచారమైంది. అయితే తాజాగా సమంత యూటర్న్ తీసుకోవడం మరోసారి చర్చకు తావిచ్చింది. తాను ఒకటి చెబితే జనాల్లోకి ఆ వ్యాఖ్య మరోలా వెళ్లిందని సమంత మాట మార్చింది. రెండు మూడేళ్ల లో సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తానని ఎక్కడా చెప్పలేదని..తాను ఒకలా అంటే మీడియా ఆ విషయాన్నిమరోలా ఫోకస్ చేసిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. పదేళ్ల కు పైగా నటిగా కొనసాగుతున్నా. సినిమా అనేది సవాల్ తో కూడుకున్న ప్రపంచమని..ఇక్కడ ఇమడటం అంత ఈజీ కాదని మాత్రమే చెప్పానని సామ్ తెలిపింది. నటిగా కొనసాగకపోయి ఉంటే? ఇదే రంగంలో మరో విధంగానైనా నెట్టుకొస్తానని ఈ క్రమంలో కొంచెం గ్యాప్స్ రావొచ్చని అన్నాను. అంతే తప్ప సినిమాలకు దూరమవుతానని చెప్పలేదు అని వివరణ ఇచ్చింది.

నిజమే.. సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటే నాగ చైతన్య ను పెళ్లాడాక విరమించేదే. కోడలిగా ఇంటికే పరిమితయ్యేది. నమ్రతలా చైతూ కెరీర్.. బిజినెస్ వ్యవహారాలు చూస్తూ కాలం నెట్టుకొచ్చేది. అలా కాదని పెళ్లి తర్వాతా ఫ్యామీలీ కి సమస్య కాకుండా కెరీర్ ని డిజైన్ చేసుకుంది. ఎంతో కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ లో పెళ్లి అనంతరం మార్కెట్లో సత్తా చాటుతోంది. నాగార్జున కోడలిగా.. చైతూ భార్యగా తన ఇమేజ్ కి తగ్గ కథల్ని ఎంచుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. అలాగే చైతూ కి జోడీగా నటిస్తూ బ్యాలెన్సింగ్ గా వెళుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ తో పనేం ఉంటుంది?
Please Read Disclaimer