స్టార్ హీరోలపై అంతగా కక్ష కట్టిందా?

0

అక్కినేని కోడలు సమంత కెరీర్ జర్నీలో వేరియేషన్స్ గురించి తెలిసిందే. `రంగస్థలం`.. `యూటర్న్`.. `మజిలీ`.. `ఓ బేబీ` వంటి చిత్రాల్లో విలక్షణ నటనతో గొప్ప పరిణతిని ప్రదర్శించింది. శర్వానంద్ తో కలిసి నటించిన `జాను` చిత్రం ఇటీవల విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజు ఓ మంచి ఫీల్ గుడ్ చిత్రమని ఎంత చెప్పుకున్నా ప్రయోజనం దక్కలేదు. కలెక్షన్లను తీసుకురాలేకపోయింది. దీంతో కొందరు నెటిజనులు సమంతపైనా వేడెక్కించే కామెంట్స్ చేశారు. సమంతని ఫ్లాప్ హీరోయిన్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ తో చెలరేగుతున్నారు. దీంతో మండిపోయిన సమంత ఘాటుగా స్పందించింది.

“హీరోలు ఎన్ని ఫ్లాప్ లిచ్చినా పట్టించుకోరు. కానీ హీరోయిన్ సినిమా ఒక్కటి సరిగ్గా ఆడకపోయినా బ్లేమ్ చేస్తారు. స్టార్ హీరోలు తమ సినిమాల్లో అంతగా గుర్తింపు లేని పాత్రలు చేసినా రియక్ట్ కారు.. అలాగే వరుసగా మూడు ఫ్లాప్ లిచ్చినా నాలుగో సినిమాకి వెళ్ళి చూస్తారు. వాళ్ల విషయంలో ఎందుకు ప్రశ్నించరు?“ అని ఫైర్ అయిపోయింది. సమంత కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సామ్ కెరీర్ పరిశీలిస్తే.. ప్రస్తుతం `కాథువాకుల రెండు కాదల్’ చిత్రంలో నయనతార- విజయ్ సేతుపతిలతో కలిసి నటించనుంది. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సమంత తప్పుకుందనే వార్తలు కూడా వచ్చాయి. `సమంత ప్రెగ్నెట్ కాబోతుందని.. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకుందనే కామెంట్స్ వినిపించాయి. కానీ అందులో నిజం లేదని సామ్ అంది.

ఇటీవల మరో తమిళ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం లో నటించేందుకు సమంత సిద్ధమైంది. లేడీ ఓరియెంటెడ్ గా రూపొందే ఈ చిత్రంలో ఆమె యువ నటుడు ప్రశాంత్ తో రొమాన్స్ చేయబోతుంది. ప్రశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఆయనకు అంతగా ఇమేజ్ లేదనే చెప్పాలి. అలాంటి నటుడితో సమంత జోడి కట్టడం ఆసక్తిగా మారింది. అయితే తన కంటే తక్కువ ఇమేజ్ ఉన్న సహ నటుడు ఉంటే తన పాత్ర హైలైట్ అవుతుందని స్వార్థం చూపిస్తోందట. ఇక తమను తక్కువ చేసి మాట్లాడితే స్టార్ హీరోలపైనే ఫైరైపోయిన సామ్.. ఇప్పుడు స్వార్థం చూపిస్తోందన్న కామెంట్ కి ఎలా రియాక్టవుతుందో?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-