తిరుమలకు కాలినడకన సమంత.. నా కాళ్లు తొక్కితే పచ్చడే అంటూ!

0

అక్కినేని కోడలు, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. త‌న స్నేహితురాలు రమ్యా సుబ్ర‌మ‌ణియ‌న్‌తో క‌లిసి కాలినడకన శ్రీవారిని ద‌ర్శించుకున్నారు సమంత. ఇటీవల సమంత నటించిన ‘మజిలీ’ సినిమా రిలీజ్ సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారు సమంత. అనంతరం జూలై నెలలో ‘ఓ బేబీ’ రిలీజ్ సందర్భంగా రమ్య సుబ్రమణియన్‌తో కలిసి కాలినడకన 3,500 మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు సమంత. ఆరునెలల వ్యవధిలో మూడోసారి కాలినడకన తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకున్నారు సమంత.

కాగా.. బుధవారం రాత్రి అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన సమంత.. సామాన్య భక్తులతో కలిసి ఏడు కొండలు ఎక్కారు. మధ్య, మధ్యలో భక్తుల పలకరింపులతో పాటూ వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహంగా అడుగులు వేశారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో సమంత వెంటనడిచిన వారికి కాళ్లు పచ్చడి అయ్యాయి.

ఈ సందర్భంగా సమంత ఫన్నీగా స్పందిస్తూ.. ‘మీ కాళ్లు తొక్కారు కాని.. నా కాళ్లు తొక్కితే ఎక్కడ పచ్చడి అయిపోతాయని ఉంది’ అంటూ నవ్వులు చిందిస్తున్న సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సమంత కాలినడకన ప్రతిసారి తన స్నేహితురాలు, ప్రముఖ తమిళ నటి, వీజే రమ్య సుబ్రమణియన్‌ తోడుగా వెళ్తుంది. ఈసారి కూడా సమంతతో కలిసి తిరుమలకు వెళ్లిన రమ్య.. దర్శనం అద్భుతంగా జరిగిందని, సమంతతో పీస్ ఫుల్ వాక్ చాలా ఫన్నీగా ఆనందంగా ఉందంటూ సమంతతో కలిసి దిగిన ఫొటోను ఎన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రమ్య. ప్రస్తుతం సమంత.. శ‌ర్వానంద్‌తో 96 రీమేక్ చిత్రం చేస్తుంది. దీంతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది సమంత.
Please Read Disclaimer