గ్లామర్ తో సంపుతున్న జాను

0

సౌత్ లో ఉన్న టాప్ లీగ్ స్టార్ హీరోయిన్లలో సమంతా ఒకరు. పోయినేఏడాది.. ‘ఓ బేబీ’.. ‘మజిలీ’ సినిమాలతో హిట్లు నమోదు చేసింది. సామ్ ఈమధ్య ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే గతంలో లాగా ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. సినిమాలు కాకుండా సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తను ఒకవేళ సోషల్ మీడియాలో స్వయంగా షేర్ చెయ్యకపోయినా సామ్ కు సంబంధించిన ఫోటోలు వెంటనే వైరల్ అవుతాయి.

ఈమధ్య సామ్ జీ సినీ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరయింది. సాధారణంగానే సమంతా ఫ్యాషన్ పీక్స్ లో ఉంటుంది. ఇక ఇలాంటి కార్యక్రమం అయితే ఎలా ఊరుకుంటుంది? ఓ స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్ లో హొయలు పోతూ అందరినీ ఆకర్షించింది. పారదర్శకంగా ఉండే పసుపు రంగు డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజిచ్చింది. ఇయర్ రింగ్స్ తప్ప పెద్దగా ఆభరణాలు ధరించలేదు. సింపుల్ గానే కనిపిస్తూ గ్రేస్ ఫుల్ గా కనిపించింది. శ్రీమతి అయినప్పటికీ గ్లామర్ విషయంలో సమంతా ఏమాత్రం తగ్గలేదు.

ఇక సామ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే శర్వానంద్ తో కలిసి తమిళ సూపర్ హిట్ ఫిలిం ’96’ రీమేక్ ‘జాను’ లో నటిస్తోంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7 న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer