కొత్తగా బ్యూటీ థెరపీని రిఫర్ చేస్తున్న అక్కినేని కోడలు!!

0

స్టార్ హీరోయిన్ సమంత అంటే దక్షిణ భారత సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి తర్వాత కూడా మంచి ఫామ్ లో ఉన్న ఈ భామ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఓ బేబీ సినిమా విజయం సాధించిన తరువాత సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంతవరకు సమంత తరువాత ప్రాజెక్టు ఏమిటా అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పడు సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనమే అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తరచు ఫిట్నెస్ కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా అమ్మడు అదే తరహాలో ఆమె ఇంస్తాగ్రాంలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలతో అందరిలోనూ ఆసక్తి పెంచింది.

సమంత ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుత మహమ్మారి కాలంలో అమ్మడు తీసుకుంటున్న జాగ్రత్తలు మాములుగా లేవు. అందరి సలహాలు పాటిస్తూ.. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా సమంత తన ఫాలోవర్స్.. అలాగే అభిమానులకు మరో కొత్త బ్యూటీ థెరపీని రెఫెర్ చేసింది. ఎందుకంటే విటమిన్ ఇన్ఫ్యూషన్ థెరపీ కారణంగా చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుందని అంటోంది. అంతేగాక తను విటమిన్ ఇన్ఫ్యూషన్ థెరపీ చేయించుకుంటున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసి అభిమానులను హ్యాపీ చేస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో సమంత విజయ్ సేతుపతి – నయనతారల కాంబినేషన్ తో కలిసి కొత్త సినిమా చేయబోతుంది. ఆ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ రూపొందించనున్నాడు. అలాగే తెలుగులో నందిని రెడ్డితో ఓ సినిమా భర్త నాగచైతన్యతో మరో సినిమా లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.