కుర్ర హీరో సినిమాకు బ్రేకేసిన సమంత

0

టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఒకే కథతో ఒకరికి తెలియకుండా ఒకరు సినిమా ప్లాన్ చేసుకొని తీరా తెలిసాక నాలుక కరుచుకుంటారు. లేటెస్ట్ గా సమంత ‘ఓ బేబీ’ సినిమాకు ‘విఠలాచర్య’ కథ పోలి ఉన్న కారణంగా ఆ సినిమాను ఆపేశారట. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఆ మధ్య ‘విఠలాచార్య’ అనే సినిమాను మొదలెట్టారు. గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా చేశారు. అయితే ఓ ఐదు రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యం అయింది. ఈ లోపు సమంత ‘ఓ బేబీ’ సినిమా వచ్చేసింది.

‘ఓ బేబీ ‘సినిమాలో బేబీ అనే వృద్ధురాలు యవ్వనం పొందుతుంది. సరిగ్గా ‘విఠలాచార్య’ కథ కూడా అంతే అట. అందుకే సమంత సినిమా చూసాక చేసేదేం లేక సినిమాను ఆపేసునుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని హీరో నవీన్ విజయ్ కృష్ణ స్వయంగా చెప్పాడు. అయితే ఆ సినిమాను ఎలాగైనా తీసే ఆలోచనలో ఉన్నామని కథలో ఏదైనా మార్పులు చేసి మళ్లీ షూట్ చేసే ప్లాన్ ఉందని చెప్పాడు.

ఇక ఈ హీరోకి ఇది కొత్తేమి కాదు. నవీన్ చేసిన మొదటి సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’ కూడా రిలీజ్ వరకూ వచ్చి అటకెక్కింది. నిజానికి ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ అనిపించుకుంటున్న కీర్తి సురేష్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అవ్వాలి. సినిమా ఆగిపోవడం అదే సమయంలో కీర్తికి ‘నేను శైలజా’ ఆఫర్ రావడం జరిగింది. ఇక చేసేదేం లేక ఆ సినిమాను వదిలేసి ‘నందిని నర్సింగ్ హోమ్’ తో హీరోగా పరిచయమయ్యాడు నవీన్. ఇప్పుడు రెండో సినిమాగా ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాను రిలీజ్ కి రెడీ చేసాడు. ఏదేమైనా చేసిన నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు ఆగిపోవడం ఈ కుర్ర కెరీర్ కి ఎఫెక్టే.
Please Read Disclaimer