ఆ వార్తను కన్ఫర్మ్ చేసిన సమంత

0

ఈమద్య కాలంలో సినిమాల స్థాయిలో వెబ్ సిరీస్ లు కూడా పోటీ పడుతున్నాయి. బడ్జెట్ విషయంలో క్వాలిటీ విషయంలో ఇలా అన్ని విషయాల్లో కూడా వెబ్ సిరీస్ లో సినిమాలతో పోటీ పడుతున్నాయి. అందుకే వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఫిల్మ్ స్టార్స్ కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ముందు వెబ్ సిరీస్ ల్లో అంతా కొత్త వారు లేదంటే చిన్న నటీనటులు నటించే వారు. కాని ఇప్పుడు స్టార్స్ నుండి సూపర్ స్టార్స్ వరకు కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. సమంత కూడా వెబ్ సిరీస్ ల దారి పట్టింది.

ఇటీవల వచ్చిన ‘ది ఫ్యామిలీ మన్’ అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయిన ఈ వెబ్ సిరీస్ దాదాపు అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెబ్ సిరీస్ రెండవ సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి సీజన్ లో మనోజ్ బాజ్ పాయి మరియు ప్రియమణిలు కీలక పాత్రల్లో కనిపించారు. రెండవ సీజన్ లో సమంత నటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా సమంత ఆ విషయమై క్లారిటీ ఇచ్చేసింది.

ది ఫ్యామిలీ మన్ సీజన్ 2 లో కీలక పాత్రను సమంత పోషించబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ప్రకటించింది. వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లుగా ఆమె అధికారికంగా ప్రకటించడంతో ప్రేక్షకులు అంతా కూడా ఎప్పుడెప్పుడు ఫ్యామిలీ మన్ సీజన్ 2 వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది స్టార్స్ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. వాళ్ల దారిలోనే సమంత కూడా నడువబోతుంది. సమంత దారిలో మరెంత మంది వెబ్ సిరీస్ ల దారి పడతారో చూడాలి.