జాను దెబ్బకు సమంతా క్రేజ్ హుష్ కాకీ!

0

టాలీవుడ్ లోనే కాదు.. దక్షిణాదిన ఉన్న టాప్ హీరోయిన్లలో సమంతా ఒకరు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ప్రతి హీరోయిన్ కూడా చేస్తుంది కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం వారిలో చాలామంది వల్ల కాదు. అలా ఆడియన్సును థియేటర్లకు రప్పించగల క్రేజ్ సమంతా సొంతం. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయిందా అనే కొత్త అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

సమంతా నటించిన ‘U టర్న్’.. ‘ఓ బేబీ’ సినిమాల రిలీజ్ కు ముందు మంచి బజ్ కనిపించింది. ‘ఓ బేబీ’ రిలీజ్ సమయంలో సమంతా క్రేజ్ పీక్స్ లో కనిపించింది. ఇక ‘మజిలీ’ లో హీరో నాగచైతన్య అయినా సమంతా తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయింది. ఈ సినిమాలకు కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. అయితే సమంతా కొత్త సినిమా ‘జాను’ విషయానికి వచ్చేసరికి ఆ మ్యాజిక్ అసలు పనిచెయ్యలేదు. సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్లు నిరాశాజనకంగా ఉన్నాయి. శర్వానంద్ కూడా ఫ్లాపుల్లో ఉండడంతో ఈ సినిమాకు క్రేజ్ తీసుకురాలేకపోయాడు. ఏదేమైనా ‘జాను’ మాత్రం ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.

ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే సమంతా క్రేజ్ కూడా తగ్గిపోయిందేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో ‘జాను’ వల్లే సమంతా క్రేజ్ దెబ్బతిన్నదని కూడా రివర్స్ లో కామెంట్ చేస్తున్నారు. సమంతా ఈ రీమేక్ లో చెయ్యను అని తప్పించుకున్నప్పటికీ పట్టుబట్టి మరీ చేయించారని.. సమంతా భయపడినట్టే జరిగిందని అంటున్నారు.
Please Read Disclaimer