మామ బర్త్ డే వేళ..సామ్ పింక్ డ్రెస్ ప్రైస్ తెలిస్తే అవాక్కే

0

తనకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంటారు టాలీవుడ్ బ్యూటీ సమంత. సామాజిక అంశాలతో పాటు.. తన వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసుకుంటారు. బోల్డ్ అండ్ బ్యూటిపుల్ అన్నట్లుగా ఉండే సమంత.. తాను షేర్ చేసుకునే ఫోటోలతో వార్తల్లో నిలవటమే కాదు.. ఆసక్తికర చర్చకు తెర తీస్తుంటారు.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి అందరి చూపు పడేలా చేయటమే కాదు.. సామ్ ధరించే దుస్తులు మరీ ఇంత ఖరీదా? అన్న ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉన్న సమంత.. భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిల్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం స్పెయిన్ కు వచ్చేశారు. దీనికి కారణం లేకపోలేదు.

నాగ్ 60వ పుట్టిన రోజు వేడుకల్ని స్పెయిన్ లో ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా పింక్ కలర్ పొట్టి డ్రెస్ తో అదరకొట్టేసింది సామ్. మామ పుట్టినరోజు వేడుకలు పాత విషయమే అయినప్పటికీ.. ఆ సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్ మీద మాత్రం జోరైన చర్చ సాగుతోంది. చిట్టి పొట్టి డ్రెస్ తో ఆకర్షణీయంగా ఉండే సామ్.. మామ పుట్టిన రోజు సందర్భంగా వేసుకున్న పింక్ డ్రెస్ ఏకంగా రూ.2లక్షల మేర ఉంటుందంటున్నారు.

కొడుకుల మధ్య కుర్రాడిలో కలిసిపోయిన నాగ్ మాత్రం తన బర్త్ డే డ్రెస్ ను చాలా సింఫుల్ గా ఉండేలా చూసుకుంటే.. సామ్ మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వన్ అండ్ ఓన్లీ పీస్ అన్నట్లుగా ఇస్పెషల్ గా నిలిచిందని చెప్పాలి. గులాబీ డ్రెస్సులో అసలుసిసలు గులాబీగా కనిపించిన సమంత డ్రెస్ విలువ అంత భారీగా ఉండటంపై పలువురు.. చిన్నపాటి అకేషన్ కే ఇంత కాస్ల్టీ డ్రెస్ వాడటమా? అనుకుంటే.. అక్కినేని వారి కోడలు.. అందునా సమంతా అయినప్పుడు ఆ మాత్రం ఖర్చు ఉండదా ఏంటి?Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home