కొత్త దారి పట్టిన సమంతా

0

పెళ్లి చేసుకున్నాక విభిన్న పాత్రల వైపు మొగ్గుచూపిస్తున్న సమంతా ఈ ఏడాది ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది . మజిలి సక్సెస్ ని భర్త నాగ చైతన్యతో కలిసి షేర్ చేసుకోగా ఓ బేబీ మాత్రం సోలోగా తన ఎకౌంటులో పడిపోయింది. చిన్న క్యామియో చేసిన మావయ్య సినిమా మన్మధుడు 2 దెబ్బెసినా దాని ప్రభావం తన మీద పడలేదు. ప్రస్తుతం శర్వానంద్ తో 96 రీమేక్ కు కమిట్ అయిన సామ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

కానీ శర్వాకు ఆ మధ్య కాస్త గాయం కావడంతో బ్రేక్ వస్తుందేమో అని ఊహించి ఆ కాల్ షీట్స్ ని ఓ వెబ్ సిరీస్ కు ఇచ్చేసింది. ఇప్పుడు దాని తాలూకు షూట్ లోనే చెన్నైలో బిజీగా ఉంది సామ్. 40కి పైగా కాల్ షీట్స్ ఇచ్చిందంటే ఇది ఖచ్చితంగా పెద్ద సీజన్ అయ్యుంటుంది. అమెజాన్ ప్రైమ్ దీనికి నిర్మాత. ఎలాగూ వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఊపందుకుంటోంది. హిందీలో ఇప్పటికే వీటి క్రేజ్ ఇంచుమించు సినిమాల స్థాయిలో ఉంది.

సౌత్ లో వీటి మీద అవగాహన తక్కువ కాబట్టి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. సమంతా లాంటి స్టార్స్ చేస్తే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులూ వీటి మీద ఓ లుక్ వేస్తారు. అందులోనూ మేకింగ్ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడటం లేదు. మెసేజ్ ఓరియెంటెడ్ ప్రధానంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతా రోల్ ఏంటి దర్శకుడు ఎవరు లాంటి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మొత్తానికి అందరికంటే ముందే సమంతా వెబ్ సిరీస్ లవైపు కన్నేసి తెలివైన పనే చేస్తోంది
Please Read Disclaimer