అభిమానులు పోస్ట్ చేసిన ఫొటోలకు సమంత ఫిదా

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తన జీవితంలోని ప్రతి ముఖ్యమైన సందర్బాన్ని గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక సమంతకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అయితే సమంతకు సంబంధించిన కొన్ని ఫొటోలు అభిమానులు షేర్ చేస్తే వాటిని చూసి ఆమె ఆశ్చర్య పోవడంతో పాటు వాటిని చూసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ రియాక్ట్ అయ్యింది.

ప్రమోద పరుచూరి ట్విట్టర్ లో రెండు ఫొటోలను షేర్ చేశారు. అందులో ఒక ఫొటోలో సమంత తన తల్లి ఎత్తుకుంటే బుజాలు పట్టుకుని ముద్దుగా ఉంది. ఇక రెండవ ఫొటోలో ఇటీవల ఓబేబీ సినిమా వేడుకలో సమంత తల్లిని బుజాలపై చేయి వేసి ఆప్యాయంగా హత్తుకుని ఉంది. ఈ రెండు ఫొటోలను ఉద్దేశించి ప్రేమ ఎప్పటికి అలాగే ఉంటుంది. అప్పుడు సమంత వాళ్ల అమ్మ బుజాలపై ఎత్తుకుంది ఇప్పుడు సమంత అమ్మ బుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుందని ట్వీట్ చేసింది. ప్రమోద ట్వీట్ కు సమంత హార్ట్ ఈమోజీ పోస్ట్ చేసింది.

ఇక మరో ఫొటోలో సమంత మరియు నాగచైతన్య ఏదో విషయాన్ని మాట్లాడుకుంటు ఉన్నారు. పక్కన అఖిల్ కూడా ఉన్నారు. ఏదో సీరియస్ విషయాన్ని నాగచైతన్య సమంతకు చెబుతున్నట్లుగా ఉంది. అఖిల్ మాత్రం పక్కకు తిరిగి నవ్వుతున్నాడు. ఈ ఫొటోపై సమంత స్పందిస్తూ… ఆ సమయంలో మేము ఏం మాట్లాడుకున్నామో నాకు ఇప్పటికి గుర్తుంది అంటూ లవ్ ఈమోజీని పోస్ట్ చేసింది. ఈ రెండు ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer