సామ్ కు కోపం వచ్చింది.. ఇడియట్ అనేసింది

0

సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి . డైరెక్ట్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు.. తమ సినిమాలకు చక్కగా ప్రమోషన్ చేసుకునేందుకు సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. అయితే కొందరు ఊరుపేరు లేని నెటిజన్లు.. ట్రోలర్లతో మాత్రం మహా ఇబ్బంది. ఎంతపెద్ద స్టార్ అయినా.. ఆఖరుకు ప్రధానమంత్రి కూడా వీరి బారి నుండి తప్పించుకోలేరు. తాజాగా సమంతాకు ఇలాంటి ఒక నెటిజన్ ఎదురయ్యాడు.. సామ్ కు కోపం వచ్చింది.

డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ చిన్మయి సామ్ కు క్లోజ్ ఫ్రెండ్. ‘ఓ బేబీ’ తమిళ వెర్షన్ లో సమంతాకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. వైరముత్తుపై ఆరోపణలు.. తర్వాత డబ్బింగ్ యూనియన్ నుండి చిన్మయిని బ్యాన్ చేయడం అందరికీ తెలిసిందే కదా. ఈ ఎపిసోడ్ తర్వాత రీసెంట్ గా చిన్మయిపై నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. నిషేధం ఎత్తివేసిన తర్వాత చిన్మయి డబ్బింగ్ చెప్పిన మొదటి సినిమా ‘ఓ బేబీ’. ఈ సందర్భంగా చిన్మయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీరోయిన్ సమంతాకు.. దర్శకురాలు నందినీ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ట్వీట్ కు రిప్లై గా ఒక నెటిజన్ “ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. మూవీ పక్కా ఫ్లాప్” అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో సమంతాకు కోపం రావడంతో “హహహ.. థ్యాంక్ యూ. ప్రపంచం ఇడియట్ ను.. ఇడియట్ ప్రపంచాన్ని కలువండి” అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

సమంతా ఇచ్చిన రెస్పాన్స్ ను ఎక్కువ మంది నెటిజనులు సమర్థించారు. ఇంకా సినిమా రిలీజ్ కాక మునుపే ఫ్లాప్ అవుతుందని అంటే కోపం వస్తుంది కదా అని వెనకేసుకొచ్చారు. కొంతమంది మాత్రం ఇలాంటి నెటిజన్లను అసలు పట్టించుకోవాల్సిన పని లేదని అభిప్రాయపడ్డారు.