రీల్స్ లో సమంత ఫస్ట్ వీడియో

0

ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేస్తున్న టిక్టాక్ యాప్ను ఇండియాలో సెక్యూరిటీ కారణాలతో బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. చైనా కంపెనీకి చెందిన టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేయడంతో చాలా మంది చాలా రకాల యాప్స్ను తీసుకు వచ్చారు. కాని అందులో ఏ ఒక్కటి సక్సెస్ అవ్వలేదు. కాని ఫేస్ బుక్ వారు ఇన్ స్టాలో రీల్స్ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. టిక్ టాక్ కంటే మరింత అడ్వాన్స్ గా ఉండటంతో పాటు యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

పలువురు సెలబ్రెటీలు కూడా ఈ వీడియో మేకింగ్ ఫీచర్ పై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ ఫీచర్ లోకి సమంత కూడా జాయిన్ అయ్యింది. తన మొదటి వీడియోను కూడా ఆమె చేసి దాన్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఒక సీడ్ తీసుకుని మ్యాజిక్ కెమెరా ట్రిక్స్ తో మొక్కను ఆ తర్వాత చెట్టును చూపిస్తూ సమంత వీడియో చేసింది. ఆ వీడియోకు సమంత వాడిన మ్యూజిక్ మరియు సమంత విజువల్స్ బాగున్నాయంటూ టాక్ వచ్చింది. రీల్స్ లో సమంత జాయిన్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఖచ్చితంగా రీల్స్ వినియోగం పెరిగే అవకాశం ఉందంటున్నారు.

 

View this post on Instagram

 

And it’s that easy to #GrowWithMe #FeelItReelIt

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on