సమంత స్నేహితురాలి చిట్కాలు వైరల్

0

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్ప రెడ్డి ఇటీవల వైరస్ పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. మూడు రోజుల ముందు ఆమె సమంతను కలవడంతో సమంత విషయంలో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కాని సమంతకు ఎలాంటి ప్రమాదం లేదని క్లారిటీ వచ్చింది. సమంతకు అత్యంత ఆప్తురాలిగా పేరున్న శిల్ప రెడ్డి కూడా వైరస్ నుండి బయట పడ్డట్లుగా తెలుస్తోంది. భర్త నుండి శిల్ప రెడ్డికి వైరస్ వచ్చినట్లుగా టాక్. మహమ్మారి వైరస్ నుండి ఎలా బయట పడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ శిల్ప రెడ్డి ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

శిల్ప షేర్ చేసిన ఆ వీడియోను టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా ఇది చూడండి అంటూ తన ఫాలోవర్స్ కు సూచించాడు. ఎంతో మంది ఆ వీడియోను షేర్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో శిల్ప రెడ్డి మాట్లాడుతూ… తన ఇంటికి వచ్చిన ఎవరో బంధువుల ద్వారా వైరస్ తమకు వచ్చింది. మొదట నా భర్తకు వైరస్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. లక్షణాలు ఏమీ లేకున్నా కూడా నేను టెస్టు చేయించుకున్నాను. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. వైరస్ లక్షణాలు లేకుండా వస్తుంది. ఎవరికైనా ఈ వైరస్ అనేది సోకే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వైరస్ సోకినా ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండాలంటే మొదటి నుండి కూడా పౌష్టిక ఆహారం తీసుకోవాలి. రోగ నిరోదక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో పాటు శరీరంకు శ్రమ కలిగించాలి. ఇక వెల్లుల్లి.. లవంగాలు.. తులసి ఆకులు.. మిరియాలు.. పుదీనా ఆకులు వంటివి ప్రతి రోజు ఏదో ఒక రకంగా తీసుకోవడం ద్వారా రోగ నిరోదక శక్తి పెరగడం వల్ల వైరస్ అనేది వచ్చినా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా వెళ్లి పోతుందంటూ శిల్ప సలహా ఇచ్చారు. శిల్ప సూచించిన సలహాలు తప్పక పాటించాలంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Please Read Disclaimer