మరో మూడేళ్లు వాయిదా వేస్తే ఎలా సామ్?

0

పెళ్లి కానంత కాలం పెళ్లెప్పుడు? అంటారు. పెళ్లయ్యాక పిల్లలెప్పుడు అంటారు? అందువల్ల పెళ్లి చేసుకునే ముందు.. పెళ్లాడిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేందుకు ప్రిపేర్డ్ గా ఉండాలి బ్యాచిలర్స్ అంతా. ఇక సెలబ్రిటీ ప్రపంచంలో పెళ్లయిన జంటకు ఉండే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు బిజీ షెడ్యూల్స్ తో పాటు.. మరోవైపు ఇటు పర్సనల్ లైఫ్ ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండిటికీ క్లాషెస్ వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రశ్నించి విసిగించేవాళ్లు ఎక్కువవుతారు.

అయితే అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన సమంతకు ఇవే ప్రశ్నలు పదే పదే ఎదురవుతున్నాయి. పెళ్లికి ముందు పెళ్లెప్పుడు సామ్ అంటూ మీడియా ప్రశ్నలు వేస్తుండేది. ఇప్పుడు పిల్లలెప్పుడు? ఆ శుభవార్త ఎప్పుడు? అంటూ షంటేస్తున్నారట. అయితే ఇలా తనకి ప్రశ్న ఎదురవుతుంటే సామ్ ఎంతో తెలివైన సమాధానం రెడీ చేసుకుంది. “నాపైనా.. నా శరీరంలో వచ్చే మార్పులపైనా మీ అందరూ ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి.. దానికి నేను తప్పనిసరిగా ఆన్సర్ ఇస్తాను. 7 ఆగస్టు 2020 న 7 ఏఎం ముహూర్తం ఫిక్స్ చేశాను!! అంటూ అదిరిపోయే సమాధానమే ఇచ్చింది. అంటే చై- సామ్ జంట మరో మూడేళ్ల పాటు పిల్లల్ని వాయిదా వేశారా? 2019 ఎండ్ అయిపోతోంది కాబట్టి రెండేళ్లే కదా? అనుకున్నా.. అది చాలా ఎక్కువే మరి. అయితే అప్పటివరకూ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడిపేయాలనే భావిస్తున్నారా..? సామ్ ఇప్పట్లో నటనను విరమించుకునే ఆలోచనలో మాత్రం లేనేలేదనే భావించాల్సి ఉంటుంది.

కెరీర్ పరంగా చైతన్య- సమంత ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ తో ఉన్నారు ఇద్దరూ. దీనిని ఇలానే కొనసాగించాలని భావిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది మజిలీ.. ఓ బేబి అంటూ బోలెడన్ని తీపి గురుతులు అక్కినేని ఖాతాలో పడ్డాయి. ఇక వెంకీమామతో మరో హిట్టు కొట్టడమే ధ్యేయంగా నాగచైతన్య శ్రమిస్తున్నారు. అయితే సెట్స్ లో తనకు ఎదురయ్యే ఆ ఒక్క ప్రశ్నకు చైతూ ఏమని సమాధానమిస్తున్నాడో!
Please Read Disclaimer