మామ బర్త్ డేకి కోడలు ఐడియా

0

కింగ్ నాగార్జున నటించిన `మన్మధుడు 2` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ కొత్త సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? అన్నది నాగార్జున ప్రకటించాల్సి ఉంది. ఈలోగానే కింగ్ బర్త్ డే పార్టీ గురించి ఆసక్తికర సమాచారం రివీలైంది.

ఆగస్టు 29 నాగార్జున బర్త్ డే సందర్భంగా డెస్టినేషన్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈసారి కూడా అక్కినేని అభిమానులు కింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి ఘనంగానే ప్లాన్ చేస్తున్నా హైదరాబాద్ లోకల్ గా నాగార్జున అందుబాటులో లేరు. స్పెయిన్ లోని అరుదైన అందమైన లొకేషన్ ఇబిజలో ఓ ఖరీదైన రెస్టారెంట్ లో అక్కినేని ఫ్యామిలీ బర్త్ డే సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ వేడుకలు కొద్ది మంది కుటుంబ సభ్యులు.. బంధు మిత్రుల సమక్షంలో జరుగుతోంది.

అయితే నాగార్జునకు ఊహించని విధంగా వైరల్ ఫీవర్ రావడంతో అతడు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆరోగ్యానికి వచ్చిన సమస్యేమీ లేదు అంటూ ఆయన ఫ్యాన్స్ కి సందేశం పంపించారు కాబట్టి నేటి (28 ఆగస్టు) రాత్రికి జరగబోతున్న గ్రాండ్ బర్త్ డే పార్టీలో కుటుంబ సభ్యులతో చిలౌట్ చేయనున్నారు. ప్రతిసారీ పుట్టినరోజు జరుపుకోవడం వేరు.. ఈసారి పుట్టినరోజు వేరు. ఎందుకంటే నాగార్జున 60 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి అందుకు తగ్గట్టే స్పెషల్ డేని ఇలా స్పెషల్ గా ప్లాన్ చేశారట. ఇంతకీ ఈ డెస్టినేషన్ బర్త్ డేని ప్లాన్ చేసింది ఎవరు? అంటే.. ఐడియా ఇచ్చింది అక్కినేని కోడలు సమంత అని తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్యను ఇదే తీరుగా డెస్టినేషన్ వెడ్డింగ్ తో లాక్ చేసిన సామ్ ఇప్పుడు మామ కోసం ఇలా స్పెషల్ గా ప్లాన్ చేయడంపైనా అభిమానుల్లో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.
Please Read Disclaimer